Pranitha subash in vishnu manchu movie

Pranitha Subash, Pranitha Subash in Vishnu Manchu movie, Pranitha Subash latest updates, Pranitha Subash in Allu Arjun Movie, Pranitha Subash Upcoming Movies, Vishnu Manchu latest , Vishnu Manchu Upcoming Movie, Vishnu Manchu Devakatta movie, Vishnu Manchu movie updates, Vishnu Manchu Martial Arts, Vishnu Manchu latest look, Vishnu Manchu upcoming movies

Pranitha Subash in Vishnu Manchu movie : Devakatta movie unit released press note by saying Pranitha Subash is pairing beside Actor Vishnu Manchu. Vishnu Manchu practices for his next movie for remake of Arima Nambi.

అన్నయ్యను ఆకర్షించిన తమ్ముడి తుమ్మెద

Posted: 12/28/2014 05:34 PM IST
Pranitha subash in vishnu manchu movie

మంచు ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఓ స్పెషాలిటీ ఉంది. వారింట్లో ఎవరికైనా ఒక హీరోయిన్ నచ్చిందంటే చాలు.., అందరూ సినిమాల్లో వాడేసుకుంటారు. అన్న, తమ్ముడు, అక్క  అనే తేడా లేదు ముగ్గురూ.., ఫ్యామిలీ ప్యాకేజ్ గా హీరోయిన్ ను సినిమాల్లో వాడుకుంటారు. గతంలో తాప్సి ఇలాగే అందరితో నటించింది. ఇప్పుడీ ప్లేస్ ను, బబ్లీ గర్ల్ ప్రణీత రీప్లేస్ చేస్తోంది. గతంలో తమ్ముడు మనోజ్ తో  ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో చిందేసిన ఈ అమ్మడు ఇప్పుడు అన్నయ్యతో జతకట్టనుంది.

సినిమా యూనిట్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.., దేవ కట్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రణీత హీరోయిన్ గా నటిస్తోందట. త్వరలోనే మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటుందని తెలిపారు. తమిళ హిట్ మూవీ ‘అరిమ నంబి’కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో త్రిదా చౌదరిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ఊహాగానాలు వచ్చాయి. ఆ తర్వాత త్రిదా కాదు అదా అని టాక్ వచ్చింది. చివరకు వీరిద్దరూ కాదు ప్రణిత అని కన్ఫర్మ్ చేశారు.

ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మంచు విష్ణు.., ప్రాజెక్టు కోసం బాగా కష్టపడుతున్నాడు. బ్యాంకాక్ వెళ్ళి మరీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాుడు. ఈ మద్యే ఆయన మార్షల్ ఆర్ట్స్ లుక్ విడుదల చేశారు. కొద్ది కాలంగా మంచు ఫ్యామిలీ అభిమానులు సరైన సినిమా లేక అసంతృప్తితో మునిగిపోయారు. వారందరికీ ఈ మూవీ జోష్ ఇస్తుందని నమ్ముతున్నారు. మరి మంచు ఫ్యామిలీని తమిళ సినిమా ఆదుకుంటుందా.., లేదా అనేది విడుదల అయితే తెలుస్తుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishnu Manchu  Pranitha Subash  Devakatta movies  

Other Articles