Baahubali whats app promotion

Baahubali, Baahubali movie, Baahubali movie updates, Baahubali latest, Baahubali Whats app page, Baahubali Whats app group, Baahubali shooting photos, Baahubali latest photos, Baahubali wallpapers, Baahubali cast and crew, Prabhas photos in Baahubali movie, Rana in Baahubali, Rajamouli in Baahubali, tollywood latest, upcoming telugu movies, 2015 telugu movies

Baahubali Whats app promotion : Baahubali movie unit started new way in promotion by launching Whats app page. Prabhas latest movie Baahubali shooting going on, soon it start second phase shooting in RFC. Periodical movie Baahubali making to release in April 2015

దాన్ని కూడా వదలకుండా వాడేస్తున్నావా

Posted: 12/29/2014 09:54 AM IST
Baahubali whats app promotion

‘నా వాడకం ఎలా ఉంటుందో చూపిస్తా..’ అంటూ ‘దూకుడు’లో మహేష్ బాబు చెప్పే డైలాగ్ డైరెక్టర్ రాజమౌళికి సరిగ్గా సూట్ అవుతుంది. సినిమా ప్రమోషన్ కోసం ప్రతి విభాగాన్ని, ఉన్న అవకాశాలన్నిటినీ ఉపయోగించుకోవటం తెలిసిన వ్యక్తి ఈయన. ఒక మూవీని ఎన్ని విధాలుగా ప్రమోట్ చేయవచ్చో జక్కన్నను చూస్తే తెలుస్తుంది. లేటెస్ట్ ప్రాజెక్టు ‘బాహుబలి’ షూటింగ్ రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నా.., ఈ ప్రమోషన్ వల్లనే సినిమాపై ఫ్యాన్స్, జనాలు మాట్లాడుకుంటున్నారు. క్రేజ్ తగ్గకుండా ఎప్పటికప్పుడు కొత్త పద్దతిలో ప్రమోషన్లు మొదలు పెట్టి ప్రజల్లో ఉంటున్నారు.

గతంలో పోస్టర్లు, టీజర్లు, మేకింగ్ వీడియోలు విడుదల చేసిన రాజమౌళి.., ప్రస్తుతం పాపులర్ అయిన మొబైల్ యాప్ ను వాడుకుంటున్నాడు. మొబైల్ ఫోన్లలో ఎక్కువశాతం ఉపయోగిస్తున్న వాట్సాప్ లో ‘బాహుబలి’ పేరుతో ప్రత్యేక పేజి తెరిచారు. ఈ పేజికి మొబైల్ నంబర్ కేటాయించి.., ఫ్యాన్స్ కోసం అందుబాటులో ఉంచారు. ఎవరైనా ఆ నంబర్ ను సేవ్ చేసుకుంటే వారు ‘బాహుబలి’ పేజ్/గ్రూప్ లో సభ్యులయినట్లే. సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్, ఫొటోలు, పోస్టర్లు, ఫస్ట్ లుక్ లు, వీడియోలు ఇతర సమాచారం అంతా వాట్సాప్ పేజ్ లో అందుబాటులో ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది.

గతంలో పోస్టర్లు, వీడియోలతో కాకుండా క్రికెట్ మ్యాచ్ పెడతానన్నారు. ఆ తర్వాత కామిక్ కాన్ లో ప్రమోషన్ చేశారు. ఇప్పుడిలా వాట్సాప్ లో... ఇదంతా గమనిస్తే సినిమా ఎప్పుడు వస్తుందనే ఆసక్తితో పాటు, తర్వాత ఎలా ప్రచారం చేస్తారని కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ మరో షెడ్యూల్ షూటింగ్ రామోజి ఫిలింసిటీలో జరగనుంది. రెండు భాగాలుగా విడుదల అయ్యే ఈ మూవీ తొలి పార్ట్ ఏప్రిల్ 2015లో రానుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Whats app  tollywood latest  

Other Articles