Chinnadana neekosam postponed not released december 25th

chinnadana neekosam movie postponed, chinnadana neekosam release date changed, chinnadana neekosam release postponed january 01 2015, chinnadana neekosam latest updates, nithin latest updates, mukunda movie release date, mukunda movie latest updates, varun tej next upcoming movie latest updates, mukunda movie trailers teasers photos, tollywood latest news updates

chinnadana neekosam postponed not released december 25th : nithin lead played chinnadana neekosam movie might postponed due to varun tej debut mukunda movie releasing one day before on december 24th. tollywood gossip that chinnadana neekosam may release in january but not as sankranti rece movie

చిన్నదాన నీకోసం వాయిదా?.. పవన్ ఫ్యాన్ కు వరుణ్ దెబ్బ..?

Posted: 12/20/2014 03:59 PM IST
Chinnadana neekosam postponed not released december 25th

లవర్ బాయ్ నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘చిన్నదాన నీకోసం’ విడుదలపై కొత్త ఊహాగానాలు వస్తున్నాయి. సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మూవీ యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నట్లు చెప్తున్నాయి. కానీ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం..., ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా రావటం లేదని తెలుస్తోంది. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం వారం రోజులు ఆలస్యంగా అంటే జనవరి 1 నూతన సంవత్సర కానుకగా ‘చిన్నదాన నీకోసం’ రానుంది.

ఇందుకు ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కాస్త ఆలస్యం అని కారణాలు చెప్తుండగా.., అసలు కారణం మాత్రం వరుణ్ తేజ్ అనే అనుమానాలు వస్తున్నాయి. మెగా ప్రిన్స్ నటించిన తొలి సినిమా ‘ముకుంద’ ఈనెల 24న విడుదల కానుంది. పాటలు, ట్రైలర్లకు అనూహ్య స్పందన రావటంతో పాటు.., శ్రీకాంత్ అడ్డాల సినిమా కావటంతో మెగా ఫ్యాన్స్ లో కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో పవర్ స్టార్ ఫ్యాన్ గా చెప్పుకునే నితిన్ సినిమా విడుదల కావటం అంటే మెగా ఫ్యామిలీని సవాల్ చేయటమే.

అంతేకాకుండా.., సినిమాపై ప్రజల్లో ఏ మాత్రం రెస్పాన్స్ తగ్గినా భారీగా దెబ్బతినక తప్పదు. అందుకే సుధాకర్ సన్నిహితుల సూచన ప్రకారం.., ‘చిన్నదాన నీకోసం’ను జనవరి 1 కానుకగా విడుదల చేస్తున్నారు. దీని వల్ల ‘ముకుంద’ ఫీవర్ తో కలెక్షన్ తగ్గుతుందన్న భయం ఉండదు. అంతేకాకుండా.., సంక్రాంతి రేసు సినిమాలు 9 తర్వాత విడుదల అవుతుండటంతో వాటి నుంచి కూడా ఇబ్బంది ఉండదు. నితిన్ సినిమా వాయిదా పడుతుందని ఊహాగానాలు వస్తున్నా దీనిపై మూవీ యూనిట్ ప్రకటన చేయలేదు కాబట్టి ఇవన్నీ కేవలం పుకార్లే అని ఫ్యాన్స్ చెప్తున్నారు. అసలు విషయం ఏమిటనేది మూవీ యూనిట్ నోరు విప్పితే తెలుస్తుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chinnadana neekosam release  nithin latest updates  varun tej mukunda movie  

Other Articles