Sundeep kishan beeruva audio release date

beeruva audio release date, beeruva audio release latest update, beeruva movie release date, beeruva movie latest updates, beeruva movie shooting photos, beeruva movie teaser trailer, beeruva movie first look, sundeep kishan next movie latest news updates, tollywood latest news updates

sundeep kishan beeruva audio release date : joru movie hero sundeep kishan latest flick beeruva is under shooting process movie getting ready to release after sankranti 2015, beeruva audio may release on 24th december

బీరువా ఆడియో విడుదల తేదీ ఖరారు

Posted: 12/20/2014 04:22 PM IST
Sundeep kishan beeruva audio release date

‘జోరు’ ఫ్లాప్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ‘బీరువా’ ఫస్ట్ లుక్ ను కొద్ది రోజుల క్రితం మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ తర్వాత ప్రాజెక్టు గురించి ఎక్కడా వార్తలు, గుసగుసలు వినబడలేదు. కాని లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.., చడీచప్పుడు లేకుండా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. వాస్తవంగా ఈ నెలలోనే  సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే సరైన డేట్లు లభించని కారణంగా విడుదల వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఫిలింనగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.., ఈ నెల 24న సినిమా ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇండస్ర్టీలో మంచి చిత్రాలు నిర్మించిన బ్యానర్ గా పేరొందిన ఉషా కిరణ్ మూవీస్ తో పాటు, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. భారీ అంచనాలతో వచ్చిన ‘జోరు’ పెద్ద ఫ్లాప్ అయినా.., ఈ మూవీని పెద్ద బ్యానర్ నిర్మిస్తుండటంతో బాగానే ఉంటుందన్న నమ్మకం ఏర్పడుతోంది. రామోజిరావు నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాను ‘చిన్నోడు’, ‘నా ఊపిరి’ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన కన్మన్ తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ మీకు అందిస్తాము.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beeruva movie  sundeep kishan latest update  tollywood latest  

Other Articles

Today on Telugu Wishesh