Shah rukh khan meets stanford university students in mumbai

Shah Rukh Khan meets Stanford University students, SRK meets Stanford University students, shahrukh meets california students, shahrukh says celebrate frailties and failures, shahrukh and stanford university students, shahrukh khan latest news, shahrukh khan updates, shahrukh khan latest updates, shahrukh khan latest movie fan, shahrukh up coming movies, shahrukh movie fan

Bollywood superstar Shah Rukh Khan met a few select students of the prestigious Stanford University here Thursday, and shared some of his life's experiences with them, including learning that "frailties and failures need to be celebrated".

బాలీవుడ్ బాద్ షాను కలిసిన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు

Posted: 12/20/2014 03:01 PM IST
Shah rukh khan meets stanford university students in mumbai

తన నటనతో విశ్వవాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ అగ్రనటులలో ఒకరైన బాలివుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. తన బిజీ సినీ షెడ్యూల్ నుంచి కొంత సమయాన్ని అభిమానుల కోసం కేటాయించారు. అందులోనూ వారు సాదాసీదా అభిమానులు కాదు.. ఏకంగా షారుఖ్ ఖాన్ నూ చూసేందుకు అమెరికాలోని కాలిఫోర్నీయా నుంచి వచ్చి అభిమానులు. ఇంతకీ వారెవంటారా..? కాలిఫోర్నియాలోని ప్రతిష్టాత్మకమైన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు వారు. అందులోనూ కొందరిని ఎంపిక చేసిన విద్యార్థులు మాత్రమే భారత్ కు వచ్చి ఏకంగా షారుఖ్ ఖాన్ ను కలసి సెల్పీలు తీసుకున్నారు. కాదుకాదు షారుఖ్ తో సెల్ఫీలకు పోటీ పడ్డారు.

ఇంత జరిగిందా..? మాకు అసులు తెలియనే లేదు అనుకుంటున్నారా..? అయితే కాలిఫోర్నియా నుంచి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఇక్కడకు కేవలం షారుఖ్ ఖాన్ ను కలవడం కోసమే రాలేదు.. ఆయన విజయగాధ రహస్యాలను తెలుసుకుందామని.. అతి తక్కువ సమయంలో విజయపథాన నడుస్తూ.. నటిస్తూన్న షారుఖ్ ఖాన్ విజయ రహస్యాలు ఏమిటోనని తెలుసుకునేందుకు వచ్చారు. షారుఖ్ ఖాన్ ఒక్కరే కాదు.. పలువురికి ఆదర్శంగా నిలిచిన వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను కలిసేందుకు వారు వచ్చారు. వీరిలో షారుఖ్ కూడా వుండటంతో ఆయనతో భేటీ అయ్యారు.

అయితే విదేశీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు షారుఖ్ ఖాన్ ను కలసినందుకు చాలా సంతోషపడ్డారు. అయితే తన విజయ రహస్యాలను తెలుసుకునేందుకు వచ్చిన విద్యార్థుల నుంచి వారు ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుని భారత్ పర్యటనకు వచ్చారన్న అంశాలను తెలుసుకునేందుకు షారుఖ్ చాలా శ్రద్ద చూపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ సంతోషాలతో పాటు బలహీనతలు, వైఫల్యాలను కూడా సంబరంగా జరుపుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. తమతో మాట్లాడేందుకు తన వద్ద ఎలాంటి ప్రసంగం సిద్దంచేసి లేదని, అయితే తాను సినిమా వ్యవహారాల జోలికి వెళ్లకుండా తన బలహీనతలను మాత్రం చెబుతానన్నారు. ఎన్ని విజయాలను సాధించినా, ఎంత డబ్బును సంపాదించినా.. మనిషికి తనలోని బలహీనతలను మాత్రం అధిగమించలేడని, అవి అతనితోనే వుంటాయని చెప్పారు.

అందుకే బలహీనతలను, వైఫల్యాలను సంబరంగా జరుపుకోవాలని సూచించారు. వాటిని చూసి ఏ ఒక్కరు భయపడకూడదన్నారు. అయితే వాటి నుంచి తెలుసుకోవాలని అప్పుడే వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తామని బాలివుడ్ బాద్ షా అన్నారు. తాను తాజాగా నటిస్తున్న ఫ్యాన్ అనే చిత్రం షూటింగ్ విషయాలను విద్యార్థులకు తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిశర్మ రూపొందిస్తున్నారని చెప్పారు. తన 49 ఏళ్ల వయస్సులో అంచెలంచెలుగా ఎదిగిన వైనాన్ని వారికి తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొల్ కత్తా ఫ్రాంఛస్ తీసుకుని వ్యాపారాన్ని కూడా చేస్తున్నారా అని విద్యార్థులు అడిగిన ప్రశ్నపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు. తనకు సినిమాలతో పాటు పిల్లలు, క్రికెట్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. తాను కూడా చిత్రాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. పిల్లల కోసం కిడ్జానియాతో పాటు క్రికెట్ కోసం కోల్ కత్తా నైట్ రైడర్స్ వుందని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh  Stanford  SRK  California  US  

Other Articles