Mukunda movie censor release date

mukunda movie release date, mukunda movie censor date, mukunda movie latest photos trailers, mukunda movie teaser, varun tej mukunda movie photos, mukunda movie latest updates, tollywood latest news updates

mukunda movie censor release date : varun tej debut mukunda got censored and got U/A certificate, mukunda ready to release by december 24th with un restricted certificate

మెగా ప్రిన్స్ ను ఆశీర్వదించారు ‘ముకుంద’ సెన్సార్, అప్ డేట్స్

Posted: 12/19/2014 04:31 PM IST
Mukunda movie censor release date

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలి సినిమా ‘ముకుంద’ విడుదల ముహూర్తం కోసం ఎదురుచూస్తోంది. ఏడాది చివరి వారంలో వస్తున్న ఈ సినిమా.., సంవత్సరానికి హ్యాపి ఎండింగ్ ఇస్తుందని మూవీ అనలిస్టులు చెప్తున్నారు. ఒడ్డు,పొడుగుతో అన్నీ కలగలిపిన అందగాడిలా ఉండే వరుణ్ తొలి మూవీతోనే ఇండస్ర్టీని రాక్ చేస్తాడని అంటున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని విడుదల తేదీపై అనేక ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. వీటన్నిటికి సమాధానం చెప్తూ మూవీ యూనిట్ ఈనెల 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

మరో లేటెస్ట్ అప్ డేట్ ఏమంటే.., ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మూవీని చూసిన బోర్డు సభ్యులు సినిమాను మెచ్చుకుంటూ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే ఈ సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకపోవటంతో పాటు కుటుంబ సమేతంగా చూడవచ్చన్నమాట. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో వినూత్నంగా నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఫ్యామిలి కథను అందించిన శ్రీకాంత్ అడ్డాల ‘ముకుంద’తో అందర్నీ మరోసారి ఆకట్టుకుంటాడని చెప్తున్నారు. ఈ మూవీలో కూడా వరుణ్ పేరు లేకుండా సినిమా మొత్తం నడిపిస్తాడని టాక్ విన్పిస్తోంది.

‘ఒక లైలా కోసం’ ఫేం పూజా హెగ్డే నటించిన ఈ సినిమాను ఠాగూర్ మధు నల్లమలుపు బుజ్జి కలిసి లియో ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ మద్య వచ్చిన ఆడియో సూపర్ అని టాక్ రావటంతో సినిమాపై భారి అంచనాలు నెలకొన్నాయి. తొలి సినిమాతోనే వరుణ్ అందర్నీ ఆకట్టుకుని స్టార్ హీరో స్థాయికి ఎదగాలని ‘తెలుగు విశేష్’ కోరుకుంటోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mukunda movie censor  varun tej debut updates  tollywood latest  

Other Articles