Rajinikanth lingaa movie distributors loss demands compansation

lingaa movie distributors, lingaa movie distributors problems and losses, rajinikanth lingaa distributors demand compansation, lingaa movie collections, lingaa movie latest updates, lingaa distributors on rajinikanth, tollywood latest news updates, koliwood latest news updates

rajinikanth lingaa movie distributors loss demands compansation : super star rajinikanth lingaa movie facing problems even after movie release, with average show of lingaa movie distributors losses heavily by investing more money on rajini craze distributors demands compansation from tamil super star

తలైవా ఎక్కడున్నావన్నా.., ఆదుకోవా

Posted: 12/19/2014 01:34 PM IST
Rajinikanth lingaa movie distributors loss demands compansation

ఈ మద్య భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు ఫ్లాపులవుతున్నాయి. ఒకవేళ సినిమా హిట్ అయినా.., కలెక్షన్లు లేక డీలా పడుతున్నాయి. భారీ అంచనాల మద్య గత వారం విడుదల అయిన ‘లింగా’ సినిమా పరస్థితి కూడా ఇలానే ఉంది. చివరి వరకు వివాదాలు, ఉత్కంఠల మద్య సినిమా విడుదల అయింది. ఫ్లాప్ టాక్ రాకపోయినా కలెక్షన్లు మాత్రం ఆశించినంతగా లేవు. సినిమా విడుదల క్రేజులో వరుసగా మూడు రోజుల పాటు థియేటర్లు అన్నీ ఫుల్ అయ్యాయి. కానీ నాల్గవ రోజు నుంచి సీన్ రివర్స్ అయింది. జనాలు లేక థియేటర్లు కుర్చీలకు సినిమాను చూపిస్తున్నాయి.

రజినీపై నమ్మకంతో... రవికుమార్ పై విశ్వాసంతో సినిమాను కొన్న డిస్ర్టిబ్యూటర్లు నిండా మునిగామని లబోదిబోమంటున్నారు. దేశంలో సహా ఓవర్ సీస్ లోనూ ఇదే దుస్థితి నెలకొంది. తమిళనాడులో కూడా రజినీ మూవీకి గడ్డు కాలమే వచ్చింది. అక్కడి డిస్ర్టిబ్యూటర్లు ఏకంగా రోడ్లపైకి వచ్చి తమను ఆదుకోవాలంటూ ఆందోళన బాటపడుతున్నారు. సూపర్ స్టార్ అనే క్రేజును క్యాష్ చేసుకుందామని ‘ఈరోస్’ సంస్థకు భారీగా చెల్లించి సినిమాను కొంటే.., చిల్లి గవ్వ కూడా రావటం లేదని గుండెలు బాధుకుంటున్నారు.

తమిళనాట పలువురు డిస్ర్టిబ్యూటర్లు తమ నష్టాలకు రజినీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై ఉన్న క్రేజు వల్లనే సినిమాకు అంత డబ్బు పెట్టుబడి పెట్టినందున ఆయనే నష్టాలనుంచి గట్టక్కించాలని కోరుతున్నారు. తలైవా తమ దగ్గరకు రావాలని డిమాండ్ చే్స్తున్నారు. వీరి డిమాండ్లను మన్నించి రజినీ వస్తాడా.. లేక ఏం చేస్తాడనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీతో అయినా భారీ బడ్జెట్ సినిమాల కంటే బ్రతికించే ప్రాజెక్టులు చేసుకోవటం ఉత్తమం అని దర్శక నిర్మాతలు తెలుసుకుంటే అంతకుమించిన సంతోషం మరొకటి ఉండదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles