Daggubati rana s in the making of rudrama devi

Daggubati Rana, Rana, Rana latest news, Rana birthday news, Rana movies, Rana photos, Daggubati Rana Rudrama Devi movie, Rana RudramaDevi movie, Rana movie collections, Rana latest updates, Rana movie news, Rana cinema News, Rana upcomming movies, Rana new look, Rana making of Rudrama Devi, Rana Bahubali

On the occassion of Daggubati Rana Birthday, the making of Rudrama Devi second journal released

ITEMVIDEOS: నిడవర్ధ్యపురం యువరాజుగా రాణా అదుర్స్..!

Posted: 12/14/2014 02:04 PM IST
Daggubati rana s in the making of rudrama devi


నిడవర్ద్యపురం యువరాజు చాళుక్య వీరభద్రుడి రాజసం, ధీరత్వం, అనన్యసామాన్యమైన పోరాటపటిమను వెండితెర ఆవిష్కృతం చేస్తూ రూపొందుతున్న చిత్రం రుద్రమదేవి. అనుష్క టైటిల్ రోల్ పోషిస్త్తోంది. హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడీ పరిజ్ఞానంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకనిర్మాత. ఇవాళ రానా జన్మదినాన్ని పురస్కరించుకుని.. చిత్రంలో రాణా నటించిన చాళుక్య వీరభద్రుడి పాత్ర తాలూకు మేకింగ్ అఫ్ రుద్రమదేవీ రెండో టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రాణా దగ్గుబాలి తన ఆహార్యానికి పూర్తిగా సరిపోయేట్లుగా నిడవర్థ్యపురం యువరాజు పాత్రను పోషించారు.

వీరభద్రుడు పాత్రకు ఆయన ప్రాణ ప్రతిష్ట చేశారు. పోరాట యోధుడిగా, యువరాజుగా రానా నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అనుష్క, రానాల మధ్య వచ్చే శృంగార సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. కాకతీయుల కాలం నాటి సాంఘిక,ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం. కీలకమైన గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటన చిత్రానికి మరో హైలైట్. ఇళయరాజా సంగీతానికి సిరివెన్నెల సాహిత్యం చక్కగా కుదిరింది.

నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తిచేసి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. కృష్ణంరాజు, సుమన్, నిత్యామీనన్, కేథరిన్, ప్రకాష్‌రాజ్, ఆదిత్య మీనన్, అజయ్, వేణుమాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్ విన్సెంట్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కాస్ట్యూమ్ డిజైనర్: నీతా లుల్లా.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daghupati Rana  Bahubali  RudramaDevi  Rana latest updates  Rana Daggubati birthday  

Other Articles