Ram gopal varma spot movie sankranti release

spot movie release date, spot movie shooting photos, spot movie latest updates, spot movie trailors teasers photos, spot movie cast and crew, sankranti 2015 telugu movies, ram gopal varma on spot movie, temper movie updates, gopala gopala latest movies

ram gopal varma spot movie sankranti release : controversy director ram gopal varma latest movie spot getting ready to release for sankranti, rgv spot movie comes to end of shooting part will release for sankranti

సంక్రాంతికి ‘స్పాట్’ పెడతాడట

Posted: 12/15/2014 08:34 AM IST
Ram gopal varma spot movie sankranti release

పండగ పూట పాపం చేయవద్దు అని మన పెద్దలు చెప్తుంటారు. కానీ ఈ సారి సంక్రాంతికి ఇది తప్పేలా కన్పించటం లేదు.  దయ్యాుల, భూతాల సినిమాలు తీసి జనాలను భయపెట్టే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ ‘స్పాట్’ సంక్రాంతికి విడుదల అవుతుందట. మొన్నీ మద్యే కదా సినిమా పేరు ప్రకటించింది అప్పుడే ఎలా పూర్తయింది అనుకుంటున్నారా.., అదే వర్మ అంటే. సినిమా టైటిల్ ప్రకటించగానే షూటింగ్ మొదలు పెట్టేసి చకచకా షెడ్యూల్లు పూర్తి చేసుకుంటూ వస్తాడు.


లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.., ఈ సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకుని మూడవ షెడ్యూల్ లో ఉంది. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పది నిమిషాల కథను సినిమాగా చూపిస్తానని చెప్పటంతో కథ పెద్దగా ఉండదు అని స్పష్టమవుతోంది. అయితే ఓబుల్ రెడ్డి హత్య వెనక ఉన్న అసలు విషయాలను కాస్త లోతుగా తెలుసుకునే అవకాశం ఈ సినిమా ద్వారా వస్తుంది. ‘ఐస్ క్రీమ్’, ‘ఐస్ క్రీమ్2’సినిమాలను నిర్మించిన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈ మూవీని భీమవరం టాకీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

సంక్రాంతికి ‘టెంపర్’, ‘గోపాల గోపాల’ వంటి భారీ సినిమాలు పోటి పడుతున్నాయి. వీరి పోటీని తట్టుకోలేక ‘రుద్రమదేవి’ లాంటి సినిమాలే సైడ్ అయిపోతున్నాయి. అంతేకాకుండా ఇవన్నీ కూడా ‘ఐ’ని తట్టుకోవటం ఎలా అని అంతర్మధనంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో నేనూ పోటిలో ఉన్నాను అని చెప్తే ఏమనుకోవాలి. అయినా థియేటర్లు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో తెలియటం లేదు. కాబట్టి దీన్ని సినిమా రెడి.., వెయిటింగ్ ఫర్ రిలీజ్ అనుకోవాల్సిందే.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spot movie release  2015 sankranti telugu movies  tollywood updates  

Other Articles