Ram gopal varma spot movie audio poster

ram gopal varma spot audio poster, rgv spot audio poster, ram gopal varma latest news updates, ram gopal varma upcoming movies, ram gopal varma movies, ice cream 2 movie updates, sridevi movie updates, rakta charitra movie sequence

ram gopal varma spot movie audio poster : ram gopal varma upcoming spot movie audio poster released in social media, it tells about the same content of his previous voice message content with background music and also movie theme music

నీకు స్పాట్ పెడతారేమో జాగ్రత్త ! (వీడియో)

Posted: 12/09/2014 12:15 PM IST
Ram gopal varma spot movie audio poster

కొరివితో అన్ని భాగాలు గోక్కునే మనస్తత్వం ఉన్న రామ్ గోపాల్ వర్మ మరో ప్రయోగానికి సిద్దమైన విషయం తెలిసిందే. ‘స్పాట్’ పేరుతో త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ గతలోనే వాయిస్ హెచ్చరిక కూడా విడుదల చేశాడు. ఆయన మహాభారతంలా ఫీల్ అయ్యే ‘రక్త చరిత్ర’ సినిమాలో చూపించలేని గొప్ప సన్నివేశాలను ఈ మూవీ ద్వారా చూపిస్తానని ప్రకటించుకున్నాడు. అప్పట్లో మిగిలిపోయిన తనలోని కసి, ఇంకా ఏదో చూపించాలన్న తపన అంతా ‘స్పాట్’లో కన్పిస్తుంది అని చెప్పాడు. ఇదంతా గతంలోనే ఓ వాయిస్ మెసేజ్ పంపి చెప్పిన వర్మ.., మరోసారి ఇదే వాయిస్ మెసేజ్ ఇవాళ విడుదల చేశాడు. అయితే దీనికి కాస్త బ్యాగ్రౌండ్ మ్యూజిక్, చివరలో సినిమా థీమ్ సాంగ్ వేసి ‘స్పాట్’ ఆడియో పోస్టర్ అని పేరు పెట్టి సోషల్ మీడియాలోకి వదిలాడు.

ఓ చిన్న కథను, ఘటనను తీసుకుని రాము సినిమా తీస్తేనే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. అలాంటిది సినిమాలోని పది నిమిషాల పాయింట్ ను తీసుకుని రెండున్నర గంటల సినిమాగా చూపిస్తానంటే అది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘రక్త చరిత్ర’లో పది నిమిషాలు ఉండే ఓబుల్ రెడ్డి హత్యను ఈ సినిమా స్టోరీగా చూపిస్తారట. ఆయన ఎందుకు, ఎలా చంపబడ్డాడు. స్పాట్ ఎలా పెట్టారు, ఎవరు ఎక్కడ ప్లాన్ వేశారు వంటి నేరాలు ఘోరాలు చాలా చక్కగా చూపిస్తాను అంటున్నాడు. ‘రక్తచరిత్ర’ సమయంలోనే కథలో తేడాలొస్తే..., అంటూ వార్నింగులు వచ్చిన విషయం గుర్తుందే. ఇప్పడు ఏకంగా లోపలికి వెళ్లి కెమెరా పెడుతున్నావు.., వాళ్లు గానీ ఫోకస్ నీపై పెడితే (ఏమవుతుందో తర్వాత తెలుసుకోవచ్చు, ముందయితే ఈ పోస్టర్ చూడండి)


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spot audio poster  ram gopal varma movies  telugu faction movies  

Other Articles