Balakrishna visits cancer patient sravani in basavatarakam

balakrishna meets sravani, balakrishna meets cancer patients, balakrishna on basavatarakam, balakrishna on cancer treatment, basavatarakam cancer treatment latest, indian cancer patients, nandamuri family updates, nandamuri balakrishna next movie updates

balakrishna visits cancer patient sravani in basavatarakam : nandamuri balakrishna fulfills dream of a cancer patient girl by meeting her in basavatarakam hospital, balakrishna also done same like pawan kalyan by meeting a cancer affected girl named sravani (12) in basavatarakam hospital

చిన్నారి కోరిక తీర్చిన నందమూరి సింహం

Posted: 12/09/2014 04:22 PM IST
Balakrishna visits cancer patient sravani in basavatarakam


మంచి పని చేయాలన్న తపన ఉండాలి కానీ.. చిన్నా పెద్దా అనే తేడా ఉండదు. అది పవన్ అయినా సరే.., బాలకృష్ణ అయినా సరే. తమను కోరుకున్న అభిమానుల కష్టాలను తీర్చేందుకు వీరు తమవంతుగా సాయం చేస్తున్నారు. ఆ మద్య పవన్ ఖమ్మంకు వెళ్ళిన విషయం అందరికి గుర్తుండి ఉంటుంది. తనను చూడాలని తపిస్తున్న శ్రీజ గురించి మేక్ ఏ విష్ ద్వారా తెలుసుకున్న పవర్ స్టార్ ఖమ్మంకు వెళ్ళి చిన్నారిని కలిశాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ సమయంలో చిన్నారి కోమాలో ఉంది. చిన్నారి బాధ చూసి తట్టుకోలేక పవన్ కంటతడి పెట్టారు. అమ్మాయి ఆరోగ్యం నయం అయ్యాక మళ్లీ వస్తాను అని కూడా హామి ఇచ్చారు.

మంచి మనసుతో అనే కొందరి మాట ఫలిస్తుంది అన్నట్లుగా.., శ్రీజ పుట్టినరోజుకు మామూలు అమ్మాయిలా మాట్లడగలిగింది. ఇప్పుడా  చిన్నారి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి కూడా వెళ్ళింది. ఇప్పుడు బాలయ్య కూడా సరిగ్గా ఇదే చేశాడు. నరసారావుపేటకు చెందిన శ్రావణి(12) అనే చిన్నారి క్యాన్సర్ తో బాధపడుతోంది.హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చిన్నారి చికిత్స పొందుతోంది. ఈ మద్యే కోమా నుంచి బయటకు వచ్చిందట. ఈ అమ్మాయికి బాలయ్య అంటే చాలా ఇష్టం,  ఆయన్ను చూడాలని ఉందని తల్లితండ్రులకు చెప్పింది.

ఈ విషయం కొందరు వ్యక్తుల ద్వారా బాలకృష్ణకు తెలిసింది. చిన్నారి గురించి తెలుసుకుని చలించిపోయిన లెజెండ్ అమ్మాయి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నాడు. శ్రావణి దగ్గరకు వెళ్లి సరదాగా ముచ్చటించి అమ్మాయిని సంతోషంలో ముంచేశాుడు. బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పాడు. ఆదుకుంటామని హామి ఇచ్చాుడు. బాలయ్య ప్రభావమో లేక మందుల ప్రభావమో కానీ అమ్మాయి మాత్రం క్రమంగా కోలుకుంటోందని శ్రావణికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు చెప్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా ఇలా తమకు తోచిన విధంగా మనుషులకు సాయం చేస్తే దేవుడికి చేసినట్లే అవుతుంది. ప్రాణాలు పోసే శక్తిగల డాక్టర్లు కూడా నయం చేయలేని రోగాలను తమ మాటలతో మాన్పివేస్తున్న నటులను ఏ పేరున పొగడగలము.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles