Aamir khan buys saree for anushka sharma

aamir khan buys saree for anushka sharma, aamir khan saree gift to anushka, aamir khan kashi tour, aamir khan on anushka sharma, aamir khan pk movie latest songs, aamir khan anushka sharma pk movie photos trailers, pk movie latest updates, bollywood latest news updates, anushka sharma virat kohli latest updates

aamir khan buys saree for anushka sharma : pk movie hero aamir khan boughts a saree for anushka sharma in his kashi tour, aamir khan spends one hour to bought banarasi saree for anushka sharma

నీ గంట కష్టానికి అమ్మడు తృప్తి పడుతుందా....?

Posted: 12/09/2014 12:11 PM IST
Aamir khan buys saree for anushka sharma

బాలీవుడ్ లో మంచి హీరోగా పేరున్న అమీర్ ఖాన్ కూడా అప్పుడప్పుడూ తింగరి వేషాలు వేస్తున్నాడు. ఒక ప్రాజెక్టులో నటించే సమయంలో హీరో, హీరోయిన్లు ఫోన్ నంబర్లు మార్చుకోవటం సహజమే. అక్కడితో మొదలయ్యే రిలేషన్.., ఎంతదూరం కొనసాగుతుందో చెప్పలేము. అభిమానంను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తారు. బర్త్ డే గిఫ్ట్ తో ఒకరు, సడన్ సర్ ప్రైజ్ గిఫ్టులతో మరొకరు మనసు దోచుకుంటారు. గుడ్ బాయ్ అమీర్ ఖాన్ కూడా అలాగే అనుష్క కోసం గిఫ్ట్ కొన్నాడు. ఓపెన్ సీక్రెట్ గా మారిన ఈ బహుమతి కొనేందుకు ‘పీకే’ బాయ్ చాలా కష్టాలు పడ్డాడు.

సినిమా ప్రమోషన్ కోసం కాశీకి వెళ్ళిన అమీర్ ఖాన్.., ఖాళీగా ఉండటం ఎందుకని షాపింగ్ చేశాడు. ఆ సమయంలోనే హీరోయిన్ కు చీరను గిఫ్ట్ గా ఇవ్వాలని భావించి ఓ గంటపాటు షాపులన్నీ వెతికాడు. అమ్మడి టేస్ట్, స్కిన్ టోన్ కు తగ్గట్టు ఓ షాపులో చీర దొరకటంతో.., ఇది ఫిక్స్ అని ప్యాక్ చేయించారట. ఎరుపురంగులో ఉన్న బనారస్ చీరలో అనుష్కను అమీర్ ఊహించుకుంటే జిగేల్ మంటూ మెరిసే రాకుమారిలా కన్పించిందట. అబ్బాయి మంచి మనసుతోనే చీర కొన్నా.., పాడు లోకం ఊరుకోదు కదా అందుకే.., కోహ్లికి కాంపిటిషనా.., కొత్త అప్లికేషనా అంటూ ఏదో ఒక కామెంట్ చేస్తూ ఆటపట్టిస్తోంది.

రాజ్ కుమార్ హిరాని దర్శకత్వం వహించిన ‘పీకే’ సినిమా ఈనెల 19న విడుదల కానుంది. ఈ మద్య విడుదలైన పాటలు, ట్రైలర్లతో పాటు, డిఫరెంట్ గా ఉన్న ఫొటోలు అభిమానులను చాలా ఆకట్టుకుంటున్నాయి. తనకు సెంటిమెంట్ అయిన క్రిస్టమస్ సీజన్ లోనే ఈ మూవీ కూడా విడుదల అవుతుండటంతో హిట్ అవుతుందని అమీర్ ఆశిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan saree gift  anushka sharma pk movie photos  virat kohli love  

Other Articles