Cinema political celebrities pays tribute to nandamuri janakiram

cinema, political celebrities tribute to janakiram, NH 65 road accident, road accident on national Highway, Nandamuri janakiram, Hari krishna, cinema, political celebrities tribute, cinema, political celebrities pays tribute to janakiram, cinema, political celebrities condolence to janakiram

cinema, political celebrities came to masab tank harikrishna house to pays tribute to nandamuri janakiram, and expressed condolence to his family members

కడసారి చూపుకోసం కదిలిన సినీ,రాజకీయ ప్రముఖులు..

Posted: 12/07/2014 12:54 PM IST
Cinema political celebrities pays tribute to nandamuri janakiram

రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్.. కడపారి చూపుకోసం సినీ, రాజకీయ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు కదిలారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని హరికృష్ణ నివాసానికి చేరుకున్న పలువురు ప్రముఖులు జానకిరామ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జానకిరామ్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, తారకరత్న, నిర్మాతలు సురేష్‌బాబు, శ్యాంప్రసాద్‌రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, వైకాపా అధ్యక్షుడు జగన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, వందేమాతరం శ్రీనివాస్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మండవ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు, సినీనటులు పెద్ద ఎత్తున తరలివచ్చి హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు.

డ్రైవర్ వున్నా.. ఎయిర్ బ్యాగ్ వున్నా..

స్వయంగా కారు నడపడమే నందమూరి జానకిరామ్ మృతికి దారితీసినట్టు తెలుస్తోంది. కారుకు ఎయిర్ బ్యాగ్ వున్నా జానకిరామ్ మృత్యువు నుంచి బయటపడేవారని తెలుస్తోంది. డ్రైవర్‌ను తీసుకెళ్లకుండా, జానకిరామ్ స్వయంగా సఫారీ వాహనాన్ని నడుపుతూ హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. కోదాడ శివారు ఆకుపాముల వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. వరి నారు లోడుతో వస్తున్న ట్రాక్టర్ యూ టర్న్ తీసుకునే క్రమంలో రెండు వాహనాలూ ఢీకొన్నాయి. జానకిరామ్‌కు ట్రాక్టర్ ట్రాలీ నేరుగా, బలంగా తగిలింది. ఈ ఘటనలో జానకిరామ్ కు ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పాటు తల వెనుకభాగం, వెన్నెముక, ఎడమకాలు తొడ భాగంలో విపరీతంగా గాయాలయ్యాయి. స్తానికులు అసుపత్రికి తరలించిగా అప్పటికే అయన చనిపోయారని వైద్యులు తెలిపారు.


Simple Picture Slideshow:
No images found in folder /home/teluguwi/public_html/images/slideshows/janaki-ram

హరికృష్ణ తనయులకే ఎందికిలా...

నందమూరి హరికృష్ణ తనయులలో ఇద్దరూ ఆ జిల్లాలోనే రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. ఐదేళ్ల వ్యవధిలో, 15 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటనలు జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ మృత్యుంజయుడిగా బయటపడగా ఆయన అన్నయ్య జానకిరామ్ మాత్రం మృత్యు ఒడికి చేరుకున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెదేపా తరఫున విస్తృత ప్రచారం చేశారు. ఆ ఏడాది మార్చి 26వ తేదీ రాత్రి ఖమ్మం జిల్లాలో ఎన్నికల సభ ముగించుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు. ఖమ్మం-సూర్యాపేట రహదారిలో వస్తున్న ఎన్టీఆర్... నల్గొండ జిల్లా మోతె మండల కేంద్రానికి చేరుకోగానే వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. రాత్రి 10.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూల మలుపు వద్ద నుంచి కొద్దిదూరంలో వాహనం ఎగిరి పడింది. అక్కడికి సమీపంలోనే 40 అడుగుల లోతు బావి ఉంది. బావిలో వాహనం పడకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

అదే కారులో ఎన్టీఆర్‌తోపాటు సినీనటులు రాజీవ్ కనకాల, శ్రీనివాస్‌రెడ్డిలు కూడా ఉన్నారు. నందమూరి హరికృష్ణకు ఐదేళ్ల క్రితం పుత్రశోకం తప్పినా... ఇప్పుడు మాత్రం తప్పలేదు! జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగిన నల్గొండ జిల్లాలోనే జానకిరామ్ మృత్యువాత పడటం గమనార్హం. ఖమ్మం-సూర్యాపేట రహదారిపై ఎన్టీఆర్ కారు బోల్తా పడగా, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై జానకిరామ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ రెండు ప్రమాద స్థలాలు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి.

ఫేస్ బుక్ నిండా తాత జ్ఞాపకాలే..

నందమూరి జానకీరామ్‌కు తాత స్వర్గీయ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. అందుకు గుర్తుగా చిన్నతనంలో తాతతో కలిసి దిగిన ఫొటోలు, ఎన్టీఆర్‌కు సంబంధించిన కార్టూన్లు, ఫొటోలను  ఫేస్ బుక్‌లో భద్రపరుచుకున్నారు. అంతే కాదు తన కుమారునికి సైతం నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్)అని పేరు పెట్టుకున్నారు. 1977లో ఎన్టీఆర్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చాణక్యచంద్రగుప్త సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని జానకీరామ్‌ను ఎత్తుకుని దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో భద్రంగా దాచుకున్నారు. చిన్నతనంలో ఏఎన్‌ఆర్, ఎన్టీఆర్‌లతో కలిసి ఫొటో దిగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో రాసుకున్నారు.    

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri janakiram  cinema  political celebrities  tribute  condolence  

Other Articles