Nandamuri janaki ram dead road accident

nandamuri janakiram, nandamuri harikrishna, nandamuri janaki ram dead news, nandamuri janaki ram accident, junior ntr, nandamuri janaki ram accident dead

Nandamuri janaki ram dead road accident : harikrishna son nandamuri janakiram dead in a road accident near akulapamu

రోడ్డు ప్రమాదంలో నందమూరి జానకీరాం మృతి

Posted: 12/06/2014 08:36 PM IST
Nandamuri janaki ram dead road accident

నందమూరి వంశంలో విషాదం చోటుచేసుకుంది. సినీనటుడు, టీడీపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో జానకీరామ్ మృతి చెందారు. అతను ప్రయాణిస్తున్న టాటా సఫారీ కారు(ఏపీ 29 బీడీ 2323) అదుపుతప్పడంతో జానకీరాం మృత్యువాత పడ్డాడు. జానకీరామ్ తీవ్రంగా గాయపడిన అనంతరం హుటాహుటీనా కోదాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.  అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించాడు.

జానకీ రామ్ తానే స్వయంగా కారు నడుపుతూ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. హైవేపై వెళుతున్న కారు.. ట్రాక్టర్ ను తప్పించబోయి బోల్తాపడింది. రెండు పల్టీలు కొట్టింది. వెనుక వస్తున్న కారులోనే జానకీరామ్ ను కోదాడ ఆస్పత్రికి తరలించారు. నందమూరి జానకీరామ్ ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంటూ తన తమ్ముడు కల్యాణ్ రామ్ కు సంబంధించిన సినీ వ్యవహారాల్లో  క్రియాశీలక పాత్ర పోషించే వాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై జానకీరామ్ పలు చిత్రాలను నిర్మించాడు. ఆయనకు భార్య దీపిక, ఇద్దరు కుమారులు ఎన్టీఆర్, సౌమిత్ర  ఉన్నారు. జానకీ రామ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించనున్నారు.

janaki-ram-dead-01
janaki-ram-dead-02
janaki-ram-dead-03
janaki-ram-dead-04
janaki-ram-dead-05
janaki-ram-dead-06

తన కొడుకు విషాద మరణంతో హరికృష్ణ తీవ్ర దిగ్భాంత్రికి లోనయ్యారు. తనను దైవం మళ్లీ మోసం చేసిందని ఆయన రోదించడంతో.. అక్కడకు చేరకున్న వారంతా శోకసంధ్రంలో మునిగారు. జానకిరామ్ మరణవార్తతో హరికృష్ణ సతీమణి షాక్ గురయ్యారు. విషాద వార్త సమాచారం అందుకోవడంతో అక్కడకు చేరుకుంటున్న నందమూరి కుటింబికులు, అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులు హరికృష్ణ దంపతులను ఓదారుస్తున్నారు. దైవం తమపై ఇలా పగబడట్టం ఏంటని, తన కుటుంబ సభ్యలను అందరినీ చల్లగా చూడాలని ఉదయం మూడు గంటలకు లేచి పూజలు చేస్తున్నా ఇలా వివక్షకు గురిచేశాడని వారు విలపిస్తున్నారు. దైవం తమకు పుత్రశోకాన్ని మిగిల్చిందని శోకసంధ్రంలో మునుగుతున్నారు.

జానకీరామ్ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. విషాద వార్త అందగానే అన్ని సమావేశాలను రద్దు చేసుకున్న ఆయన.. సతీమణి భువనేశ్వరితో కలసి హరికృష్ణ నివాసానికి వచ్చారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డితో పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

జి. మనోహర్, A.S

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles