‘కొచ్చాడియాన్’ యానిమేషన్ సినిమాతో నిరాశకు గురైన అభిమానులకు సూపర్ స్టార్ రజినీకాంత్ సంతోషం కలిగించే వార్తను అందించారు. అందేటంటే.. లింగ చిత్రంతో అభిమానులతో తీన్మార్ చేయించనున్నారట. అదెలా అంటారా..? తాజాగా వస్తున్న చిత్రం లింగలో ఆయన చాన్నళ్ల తరువాత డబుల్ రోల్ చేస్తున్నారు. డబుల్ రోల్ తో అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్న రజనీ... లింగ చిత్రం మరో శుభవార్తను కూడా అందించింది. ప్రస్తుతం కేవలం రెండు గంటలా 20 నుంచి 20 నిమిషాల పాటు వుంటున్న సినిమాలే వస్తున్న నేపథ్యంలో రజనీ.. అన అభిమానుల ఆకలి తీర్చేందుకు చాన్నాళ్ల తరువాత మూడు గంటల చిత్రంతో వస్తున్నారు.
‘లింగ’ నిడివి 175 నిముషాలు. అంటే సుమారు మూడు గంటల .( కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తక్కువ) పాటు సూపర్ స్టార్ తెరపై సందడి చేయనున్నారు, దీంతో రజనికాంత్ తన అభిమానుల చేత తీన్మార్ చేయించనున్నారట. ఇటివలే ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ లభించింది. గతంలో రజినీకాంత్ తో ‘ముత్తు’, ‘నరసింహ’ వంటి సూపర్ హిట్స్ అందించిన కెఎస్ రవికుమార్ ‘లింగ’ సినిమాకు దర్శకుడు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. ఏఅర్ రెహమాన్ సంగీత దర్శకుడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. రజినీకాంత్ పుట్టినరోజున, డిసెంబర్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more