Comedian brahmanandam gives a emotional monoaction performance for memu saitam

tollywood, hudhud cyclone, comedian, brahmanandam, emotion, monoaction, performance, memu saitam

comedian brahmanandam gives a emotional monoaction performance for memu saitam

బ్రహ్మానందం ఏకపాత్రాభినయం అదుర్స్..

Posted: 11/30/2014 05:43 PM IST
Comedian brahmanandam gives a emotional monoaction performance for memu saitam

తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటై విశాఖ హుధూద్ తుఫాన్ భాదితుల సహాయార్ధం చేపట్టిన ‘మేము సైతం’ కార్యక్రమంలో అహుతులను హాస్య బ్రహ్మా బ్రహ్మానందం కన్నీళ్లు పెట్టించాడు. మేము సైతం కార్యక్రమంలో భాగంగా కామెడీ కింగ్ బ్రహ్మానందం ప్రదర్శించిన ఏకపాత్రాభినయం అహుతులను ఆకట్టుకున్నారు. మొదట తనదైన నటనతో వినోదాన్ని పండించిన ఈ హాస్య బ్రహ్మ… ప్రేక్షకుల కళ్ల నుంచి కన్నీరు ఒలికేలా నవ్వించాడు. బ్రహ్మనందం అదరహో అంటూ అభిమానులు కేకలు వేశారు.

అంతటితో ఆగకుండా మహా నటుడు ఎస్వి రంగారావు డైలాగులను చెప్పి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇక, పెర్ఫార్మన్స్ ఎండింగ్ లో బ్రాహ్మి చేసిన ఎమోషనల్ పెర్ఫార్మన్స్ కు ప్రతి ఒక్కరి నుండి ప్రసంశలు లభించాయి  హుద్ హుద్ తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ అంతా ఒక్కటై ఐక్యంగా రూపొందిచిన మేము సైతం కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులను సియం రిలిఎఫ్ ఫండ్ కు అందజేస్తారు. ఈ రోజు ఉదయం ప్రారంభమైన ర్యక్రమాలు రాత్రి వరకు ప్రేక్షకులను అలరించనున్నాయి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  hudhud cyclone  comedian  brahmanandam  emotion  monoaction  performance  memu saitam  

Other Articles