Janasena party president pavan kalyan statue in finishig stage

janasena, janasena party, janasena party president, power star, janasena party president pavan kalyan, power star pavan kalyan, pavan statue, pavan kalyan statue, finishig stage, west godavari A.K Arts shilparamam, fans, Andhrapradesh, Telangana, fans, party cadre, demand

janasena party president pavan kalyan statue in finishig stage, at west godavari A.K Arts shilparamam

తుదిరూపుకు చేరుకున్న జనసేన అధినేత విగ్రహం..

Posted: 11/29/2014 08:57 AM IST
Janasena party president pavan kalyan statue in finishig stage

జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నమూనా విగ్రహాం తుదిరూపుకు చేరుకుంది. త్వరలో పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీకి విధివిధానాలతో ప్రజల్లోకి వెళ్లనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన నమూన విగ్రహాన్ని తయారు చేసే పనిలో వున్నారు ఆయన అభిమానులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భవించిన నేపథ్యంలో.. ఇరు రాష్ట్రాలకు ఆయన విగ్రహాలను అందించాలని అభిమానులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయన అభిమనులు ఫవన్ కల్యాణ్ ను దేవుడిలా ఆరాధిస్తున్నారు. ఈ విషయంలో స్వర్గీయ ఎన్టీ రామారావు ఆధ్యాత్మిక పాత్రల్లో నటించి.. రాముడైనా, కృష్ణుడైనా.. విష్ణుమూర్తైనా.. చివరకు యముడైన, కర్ణుడైనా, రావణాసురుడైనా, ధుర్యోథనుడైనా ఆయనే అనిపించేలా తెలుగు ప్రజలను మెప్పించి, ఆరాధ్యుడయ్యాడు.

కానీ పవన్ కల్యాణ్ మాత్రం నిజాన్ని చాటి, ముక్కుసూటి మనస్తత్వంతో, గంభీరత్వం వెనుక దాగిన మానవత్తంతో, ఉదారతత్త్వంతో తన అభిమానుల పాలిట దేవుడిగా మారాడు. ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలుకరించే మృధుస్వభావి పవన్. ముఖ్యంగా ఆయన అభిమానుల కోరికలను తెలుసుకుని వాటిని తీర్ఛడంలో అందరి కంటే పవన్ ముందుంటారు. ఇవే తన ఇజమని చాటిన ఆయనను ఫాలో అయ్యే అభిమానులు.. పవనిజం ఫర్ ద ఫీపుల్.. టు ద పీఫుల్ అంటూ  పవన్ ఇజాన్ని చాటుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల కోరిక మేరకు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరానికి చెందిన ఎ.కె.ఆర్ట్స్ శిల్పారామంలో రూపొందించారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన జనసేన నేతలు, పవన్‌కల్యాణ్ అభిమానుల కోరిక మేరకు దీన్ని రూపొందిస్తున్నారు. అయితే నమూనా విగ్రహం రూపోందిన తరువాత.. దాని మాదిరిగానే మరిన్ని విగ్రహాలు తయారు చేయించి అభిమానులకు పంపనున్నారు. ఇప్పటికే నవ్యాంద్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు పవన్ కల్యాణ్ విగ్రహాల కోసం ఆర్డరు చేసినట్లు కూడా సమాచారం. పవనిజంతో ముందుకు కదులుతున్న అభిమానులకు ఆయన విగ్రహాలు బహుచక్కని మార్గంలో నడిపించాలని ఆశిద్దాం..

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles