కాస్త గ్యాపు దొరికితే చాలు పవన్ పై కామెంట్లు చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఐకాన్ గా ఉండే రేణు దేశాయ్ మరోసారి ఆయనపై స్పందించింది. తాజాగా విడుదల అయిన ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ పై కామెంట్ చేసింది. మోషన్ పోస్టర్ చూసిన రేణు.., ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ చూశాను. సరైన వ్యక్తికి సరైన పోస్టర్ గా ఇది ఉంది. ఆయన మాత్రమే అంత నిర్మలంగా, దైవత్వంతో కన్పించగలడు’ అంటూ పవన్ ను పొగడ్తలతో ముంచెత్తింది.
పవన్ పేరు ఎత్తితే పొగడ్తలు మొదలు పెట్టే రేణు దేశాయ్ పోస్టర్ పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఈ పోస్టర్ పై చాలామంది పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. పోస్టర్ విడుదల కాకముందే చూసిన టాలీవుడ్ ప్రముఖులు కొందరు..., సూపర్బ్ లుక్ అని ప్రశంసించారు. అన్నట్లుగానే పోస్టర్ చాల బాగుంది. ఆన్ లైన్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మోషన్ పోస్టర్ శుక్రవారం సాయంత్రం విడుదల కాగా అర్ధరాత్రి లోపు నాలుగు లక్షల మందికి పైగా చూశారు. దీన్నిబట్టే ఫ్యాన్స్ లో ‘గోపాల గోపాల’సినిమాపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతోంది.
గోపాలుడు సంక్రాంతికి వస్తున్న నేపథ్యంలో.. తాజా రెస్పాన్స్ చూస్తే మిగతా సినిమాల గుండెల్లో గుబులు పుట్టడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్ళనుంది. డిసెంబర్ లో సినిమా ఆడియో విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, కిశోర్ డాలి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కృష్ణుడి వేషంలో కన్పిస్తున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more