Vikram i set to release in january second week on the eve of sankranthi

vikram, shanker, i, i movie, set to release, january second week, on the eve of sankranthi, sankranthi, sankranthi movies, january movies, film news, movie news, new movies, telugu movies

vikram I set to release in january second week on the eve of sankranthi

సంక్రాంతికి తప్పక వచ్చేస్తానంటున్నాడు..

Posted: 11/23/2014 01:32 PM IST
Vikram i set to release in january second week on the eve of sankranthi

కమర్షియల్ చిత్రాలలో మంచి సందేశాన్ని మేలమించి ప్రేక్షకుల మన్ననలను పోందడంలో సక్సెస్ అయిన డైరెక్టర్ శంకర్.. తన్న కెరీర్లో మొదటిసారి ట్రై చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఐ ట్రైలర్ రిలీజ్ అయిన రో ఓజు నుంచి దక్షిణాధి ప్రేక్షకులు.. సినిమా ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజులుగా సస్పెన్స్ గా ఉన్న ఈ సినిమా విడుదలపై ఎట్టకేలకు చిత్ర యూనిట్ స్పష్టతను వెలువరించింది

2015 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది. అనుకున్న దానికంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకోవడం వలన ఈ సినిమా విడుదల ఆలస్యం జరిగిందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. విజువల్స్ పరంగా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేలా ఐ సినిమాను దర్శకులు శంకర్ రూపొందించారని చెబుతున్నారు చిత్ర యూనిట్.

విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ కూడా ప్రస్తుతం రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా ‘ఐ’ పేరుతోనే రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు ఆడియోని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles