First teaser released on naga chaithanyas birthday gets overwhelming response

first teaser, teaser, release, naga chaithanya, naga chaithanya birthday, overwhelming response, film news, movie news, new movies, telugu movies, new teasers

first teaser released on naga chaithanyas birthday, gets overwhelming response

పుట్టిన రోజున టీజర్.. మంచి రెస్సాన్..

Posted: 11/23/2014 02:11 PM IST
First teaser released on naga chaithanyas birthday gets overwhelming response

అక్కినేని వారి ఇంట మూడవ తరం నటవారసుడిగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న నాగార్జున అక్కినేని తనయుడు..నేటితరం యంగ్ హీరో నాగ చైతన్య. ఈ రోజు నాగ చైతన్య పుట్టిన రోజును పురస్కరించుకుని అక్కినేని అభిమానులు స్వచ్చంధ కార్యక్రమాలు చేపడుతుండగా.. ఇటు సినిమా ఇండ్రస్ట్రీలో ఆయనతో సినిమా తీస్తున్న సంస్థ కూడా అభిమానులకు, ప్రేక్షకులకు మంచి గిప్ట్ అందించింది. ‘స్వామి రారా’ ఫేం సుధీర్ వర్మ డైరెక్షన్ లో నాగ చైతన్య చేస్తున్న సినిమా ఫస్ట్ టీజర్ ని ఇవాళ విడుదల చేశారు.

నాగచైతన్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఈ టీజర్ కి అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇక సోషల్ నెట్వర్క్స్ నుంచి అదిరిపోయే రెస్పాస్ లభిస్తోంది. దొంగతనం అనే అంశం చుట్టూ తిరిగే కథాంశంతో మొదటి సినిమా చేసిన సుదీర్ వర్మ, తన సెకండ్ సినిమాకి కూడా అదే ఫార్ములాని ఎంచుకున్నాడు. ఒక దొంగ చుట్టూ తిరిగే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ‘ప్రతి మోసం వెనక ఇద్దరు ఉంటారు.. మోసం చేసేవాడు, మోసపోయేవాడు.. నువ్వు రెండవ వాడివి కాకూడదు అంటే మొదటి వాడివి అయ్యి తీరాలి’ అని టీజర్ లో చెప్పిన డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు చివరి దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా పేర్లను పరిశీలిస్తున్నారు. నాగ చైతన్య సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అత్తారింటికి దారేది చిత్రాన్ని విడుదల చేసిన సంస్థకే ఈ చిత్రం విడుదల రైట్స్ అందినట్లు సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles