Rajamouli apologises to prabhas fans

rajamouli apology, rajamouli on bahubali movie, bahubali movie release date, bahubali movie songs, bahubali latest news, prabhas in bahubali, prabhas latest photos in bahubali, tollywood latest news, thamanna upcoming movies, anushka upcoming movie, rana movies

rajamouli asks apology from prabhas fans : tollywood successful director rajamouli says sorry and asks apology from prabhas fans for making distance between fans and prabhas for bahubali. he explains fans that he want give a big movie with prabhas so that the gap occured and hopes after movie released all will accept him

ఎవరూ చేయలేని తప్పును చేశాడు

Posted: 10/24/2014 06:19 PM IST
Rajamouli apologises to prabhas fans

టాలీవుడ్ లో హిట్ సినిమాల డైరెక్టర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రాజమౌళి పేరు. ఎంతోమంది హీరోలతో హిట్ సినిమాలు చేసిన క్రెడిట్ ఆయనకు ఉంది. అలాంటి గొప్ప డైరెక్టర్ ఓ తప్పు చేశాడట. అదే ‘బాహుబలి’ సినిమా తీయటం అని అంటున్నాడు. ఈ సినిమా ద్వారా ఫ్యాన్స్ కు ప్రభాస్ ను దూరం చేసినందుకు తనను క్షమించాలని జక్కన్న కోరుతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాజమౌళి.. ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేశారు.

‘ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను క్షమించాలి. ఎందుకంటే అభిమాన హీరోని 2సం.లుగా మీకు దూరం చేశాను’. అయితే ఒక పెద్ద సినిమా చేయాలి అనే ఉద్దేశ్యంతో ఇంత ఆలస్యం అవుతోంది. సినిమా విడుదల అయితే కోపాన్ని మర్చిపోతారని ఆశిస్తున్నాను. గతంలో సినిమాలోని నటీనటుల పుట్టినరోజులకు పోస్టర్లు, వీడియోలను విడుదల చేసే వాళ్ళము. అయితే పని ఒత్తిడి కారణంగా ఇప్పుడిది కుదరటం లేదు.’ అని వీడియోలో తెలిపారు. అంటే గతంలో కంటే ఇప్పుడు సినిమా నిర్మాణ వేగం పెరిగింది అని స్పష్టం అవుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో షూట్ అయిన ఈ సినిమాను ప్రస్తుతం హైదారబాద్ లోని రామోజి ఫిలింసిటిలో షూట్ చేస్తున్నారు.

పలు యాక్షన్ సీన్లతో పాటు, పాటలను కూడా ఫిలింసిటీలో షూట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరగా షూట్ జరుగుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. తొలి పార్ట్ 2015 ఎప్రిల్ లో విడుదల కానుంది. టాలీవుడ్ లో ఎక్కువ  సమయం తీసుకుని, భారీ బడ్జెట్ తో వస్తున్న ప్రాజెక్టుగా ‘బాహుబలి’ రికార్డు క్రియేట్ చేసింది. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన యంగ్ రెబల్ స్టార్ పోస్టర్స్ కు స్పందన బాగుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajamouli  bahubali  prabhas  latest news  

Other Articles