Puri jagannath junior ntr movie shooting restarts in goa after tollywood labours call off their strike

junior ntr latest news, junior ntr movie news, junior ntr puri jagannath movie, director puri jagannath movie, tollywood directors list, kajal agarwal latest news, kajal agarwal hot photos, kajal agarwal movies, neno rakam movie news, temper movie news, junior ntr kajal agarwal

puri jagannath - junior ntr movie shooting restarts in goa after tollywood labours call off their strike

కాజల్ తో సరసాలు మొదలెట్టిన ఎన్టీఆర్.. వెనకడుగేసిన కార్మికులు!

Posted: 10/25/2014 10:42 AM IST
Puri jagannath junior ntr movie shooting restarts in goa after tollywood labours call off their strike

ఇటీవలే తెలుగు చిత్రపరిశ్రమలో 24 విభాగాలకు చెందిన కార్మికులు తమ వేతనాలు పెంచాలంటూ ఒక్కసారిగా సమ్మె నిర్వహించడంతో అగ్రనాయకుల సైతం ఎక్కడికక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే గోవాలో షూటింగ్ జరుపుకోవడానికి బయలుదేరిన పూరీ-ఎన్టీఆర్ మూవీ కూడా ఆగిపోయింది. అక్కడ కూడా కార్మికులు ఈ సమ్మె కారణంగా షూటింగ్ లో పాల్గొనలేదు. అయితే నిర్మాతలు ఇచ్చిన కొత్త హామీల సందర్భంలో సినీ కార్మాకులు సమ్మె విరమించడంతో చిత్రీకరణలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో కాస్త విరామం తర్వాత పూరీ-ఎన్టీఆర్ ల మూవీ షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది.

ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు కానీ.. ‘‘నేనో రకం’’, ‘‘టెంపర్’’ అనే పేర్లు పరిశీలనలో వున్నాయి. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో అక్కడ ఎన్టీఆర్-కాజల్ మధ్య కొన్ని సరదా-సరసాల సన్నివేశాలతోపాటు కొన్ని పోరాట ఘట్టాలు, పాటల చిత్రీకరణల జరగనున్నట్లు సమాచారం! ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక శక్తివంతమైన పోలీస్ అధికారిగా కనిపిస్తాడని ఎప్పటినుంచో వస్తున్న సమాచారం! ఇక కాజల్ ఇందులో సరికొత్త అవతారంలో కనిపించబోతోందని.. ఈ అమ్మడి క్యారెక్టర్ మిగతా సినిమాలకంటే కాస్త భిన్నంగానే వుంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తి చేసుకుందని యూనిట్ వర్గాల సమాచారం. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా.. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్లగణేష్ నిర్మిస్తున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే ఆడియో వేడుక నిర్వహించబోతున్నట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior ntr  director puri jagannath  kajal agarwal  bandla ganesh  tollywood strike  

Other Articles