Pawan kalyn to act in telugu remake of kaththi

kaththi movie review, kaththi movie latest updates, kaththi telugu songs, kaththi telugu release date, kaththi telugu with pawan kalyan, pawan kalyan next movie, tollywood latest news, koliwood latest news vijay next movie, telugu dubbing movies, telugu remake movies

pawan kalyn to act in telugu remake of kaththi : its have only week days to release kaththi movie in telugu but with n the gap there is some rumors spread in koliwood and tollywood that kaththi dubbing not releasing in telugu it may be remaked by pawan kalyan. the official announcement on this rumor is awaited.

పవన్ ను అవమానించిన తమిళ హీరో... తెలుగులో ‘కత్తి’ డౌటే ...?

Posted: 10/24/2014 05:43 PM IST
Pawan kalyn to act in telugu remake of kaththi

తమిళనాడులో అనేక వివాదాలు, ఉద్రిక్తతల నడుమ విడుదల అయిన ‘కత్తి’ సినిమా తెలుగులో విడుదల అంతకంటే ఎక్కువ సందిగ్దంలో పడింది. ఈనెల 31న విడుదల అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. విజయ్ తెలుగు వర్షన్ డబ్బింగ్ చెప్పటంతో పాటు దగ్గరుండి తెలుగు ప్రింట్ ఏర్పాట్లు చూసుకున్నారట అయితే ఇప్పుడు విడుదలకు వారం రోజులు ముందుగా తెలుగులో ‘కత్తి’ విడుదల కావట్లేదు అని టాలీవుడ్ లో టాక్ విన్పిస్తోంది.

ఈ సినిమాను పవన్ తో రీమేక్ చేయించాలి అని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. ఎందుకంటే తమిళ హీరో అయిన విజయ్ కు ప్రస్తుతం తెలుగులో అంతగా పాపులారిటి లేదు. కలెక్షన్లు కూడా తక్కువే వస్తాయి. కాబట్టి సూపర్ హిట్ సినిమా అయినా స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అందువల్ల ఈ ప్రాజెక్టును టాలీవుడ్ లో క్రేజ్, పాపులారిటీ ఉన్న పవన్ తో చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. సొంత ఖర్చులతో డబ్బింగ్ చేసి రిస్క్ తీసుకోవటం కంటే రీమేక్ హక్కులను అమ్మేస్తే బెటర్ అని భావిస్తున్నారు.

ఇక్కడ పవన్ - విజయ్ మద్య చిన్న లాజిక్ కూడా ఉంది. అదేమంటే.. పవన్ సూపర్ హిట్ సినిమా ‘ఖుషి’ ముందుగా తమిళంలో వచ్చింది. ఇందులో విజయ్ నటించాడు. ఆ తర్వాత పవన్ ‘తమ్ముడు’ సినిమా తమిళంలో విజయ్ తో రీమేక్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు విజయ్ సినిమాను పవన్ తో రీమేక్ చేయించాలని గతంలోనే ప్రయత్నాలు జరిగాయట. అయితే రీమేక్ వద్దు మనమే డబ్ చేసి విడుదల చేద్దాం అని విజయ్ చెప్పినట్లు సమాచారం. హిట్ కధ కావటంతో తనకు తెలుగులొ కూడా ఈ సినిమాతో ఫ్యాన్స్ వస్తారు అని తమిళ హీరో భావిస్తున్నాడు. రీమేక్ హక్కులు ఇవ్వకపోవటంతో పవన్ తరపు వారు చేసేది లేక చెన్నైనుంచి వెనక్కి వచ్చేశారు.

అయితే ఇప్పుడు మళ్ళీ నిర్మాత ఠాగూర్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రజా సమస్య నేపథ్యంగా పాపులర్ అయిన ఈ సినిమాను పవన్ ను పెట్టి సినిమా తీస్తే తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. అటు డైరెక్టర్ కూడా ఇదే బెటర్ కదా అని అంటున్నారు. అయితే విజయ్ మాత్రం పవన్ కు రీమేక్ ఇచ్చేందుకు సుముఖంగా లేరట. మొత్తానికి ఇలా అన్ని పనులు పూర్తి చేసుకున్నా సినిమా అక్టోబర్ 31న విడుదల మాత్రం కావటం లేదు అని ఫిలించాంబర్ తో దగ్గరి సంబంధాలున్న వ్యక్తులు చెప్తున్నారు. మరి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారా.. లేక ఆలస్యంగా విడుదల చేస్తారా.. రెండు కాకుండా అసలు తెలుగులో ‘కత్తి’ రాకుండా పోతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kaththi  pawan kalyan  vijay  tollywood  

Other Articles