Akkineni akhil movie confirmed

akkineni akhil wiki, akkineni akhil movies, akkineni akhil first movie, akkineni akhil movie latest updates, akkineni akhil movie details, akkineni akhil photos, akkineni akhil trailer, vv vinayak, vv vinayak movies, vv vinayak latest movies, vv vinayak upcoming movies, vv vinayak akkineni akhil movie, tollywood latest updates, latest movie news, latest telugu news, telugu latest updates, nagarjuna, nagarjuna tv show, nagarjuna family photos, akkineni fans, akkineni family

akkineni akhil first movie confirmed with director vv vinayak : commercial director vv vinayak got chance to make akkineni akhil first movie presently pre production works is going on

వినాయక్ తోనే తొలి సినిమా... కారణాలేమంటే...?

Posted: 10/15/2014 01:24 PM IST
Akkineni akhil movie confirmed

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ ఫేవరెట్ గా మారిన స్టార్ అక్కినేని అఖిల్. సినిమాల్లోకి రాకముందే క్రేజ్ ను సంపాదించుకుని నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. అఖిల్ తొలి సినిమా గురించి అనేక గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే డైరెక్టర్ విషయంలో మాత్రం వి.వి. వినాయక్ పేరే ఎక్కువగా ప్రచారంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం వినాయక్ తో సినిమా ఓకే అయిందట. అంతేకాదు ఈ మూవీకి సంబంధించి ప్రిప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది.

వినాయక్ గతంలోనే అఖిల్ సినిమాకు కధ సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పినా.., సినిమా ఖరారుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే వీటన్నిటిని పక్కకు నెట్టేస్తూ అక్కినేని నటవారసుడిని పరిచయం చేసే చాన్స్ చివరకు వినాయక్ ను వరించింది. దీంతో సినిమా తీసేందుకు వినాయక్ చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే దీపావళి తర్వాత కొద్దిరోజులకే షూటింగ్ మొదలు పెడతారట.

తాజా నిర్ణయంపై టాలీవుడ్ ప్రముఖులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ సినిమా ఇద్దరికి లాభం కల్గిస్తుంది అని అంటున్నారు. అదెలాగంటే.. కొద్ది కాలంగా ఎక్కువగా సినిమాలు చేయని.., తాజాగా ఓ ఫ్లాప్ ను మూటగట్టుకున్న వినాయక్ కు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. త్వరలో చేపట్టే భారీ ప్రాజెక్టుల అంచనాలు పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది. అటు కమర్షియల్, మాస్ మెచ్చే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వినాయక్ తో తొలి సినిమా చేయటంతో మాస్ దృష్టిలో పడతాడు. ఇదే సమయంలో క్లాస్ వర్గాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. ఇలా ఫ్యూచర్ ను ప్లాన్ చేసుకునే ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని వినాయక్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో సెట్ లోకి వచ్చే అఖిల్ కు తెలుగు విశేష్ ఆల్ ది బెస్ట్ చెప్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vv vinayak  akkineni akhil  latest updates  tollywood  

Other Articles

Today on Telugu Wishesh