Roja imitates balakrishna in assembly lobby

actress roja, roja latest news, roja imitates balakrishna, balakrishna latest news, balakrishna comments roja, roja comments balakrishna

roja imitates balakrishna in assembly lobby : ysrcp nagari mla roja imitates balakrishna in assembly lobby which goes controversial

బాలకృష్ణ మీద సెటైర్లు వేసిన రోజా!

Posted: 09/02/2014 07:16 PM IST
Roja imitates balakrishna in assembly lobby

(Image source from: roja imitates balakrishna in assembly lobby)

సాధారణంగా బాలకృష్ణ సినిమాల్లో వేసే డైలాగులకు సెటైర్లుగా రకరకాలుగా పేరడీలు రెగ్యులర్ గా చూస్తూనేవుంటాం! ఇప్పటికే చాలామంది కళాకారులు బాలయ్య నటనను, ఆయన చెప్పే డైలాగులను, ఎక్స్ ప్రెషన్స్ ను అనుకరిస్తూ సెటైర్లు వేస్తుంటారు. ఆయన నిజజీవితంలో ఏదైనా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మరుసటి రోజే.. ఆ ప్రసంగం మీద ఒక కొత్త పేరడీ యూట్యూబ్ లో అప్పటికే హల్ చల్ చేస్తుంటుంది. అయితే అదంతా కేవలం కామెడీ కోసమే మాత్రమేనంటూ సదరు సెటైరిక్ వీడియోలను నందమూరి అభిమానులు కూడా లైట్ తీసుకుని, వాళ్లు కూడా సరదా పడుతుంటారు!

ఇదిలావుండగా.. తాజాగా వైకాపా పార్టీ తరఫు నుంచి నగరి ఎమ్మెల్యేగా ఎన్నికైన నటి రోజా వున్నట్టుంది నటుడు - హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీద సెటైర్లు వేసింది. గతంలో వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లోనే నటించారు కానీ.. ప్రస్తుత రాజకీయరంగంలో మాత్రం పార్టీలపరంగా విడిపోయారు. ఇక పార్టీలపరంగా ఏవైనా కామెంట్లు చేసుకుంటే వివాదాస్పదమవుతాయన్న విషయం అందరికీ తెలిసిందే! అయినప్పటికీ రోజా అసెంబ్లీ లాబీలో బాలయ్యను అనుకరిస్తూ సెటైర్లు వేసింది.

అంతేకాదు.. బాలయ్య మాటతీరును చాలా హాస్యస్పదంగా, వ్యంగ్యంగా ప్రవర్తించింది. ‘‘ఆరోజుల్లో నాన్నగారు’’ అంటూ మొదలుపెట్టిన రోజా.. ఫక్కున నవ్వేసింది. అయితే అక్కడున్న మీడియా ప్రతినిధి తన మాటలను పూర్తి చేయాల్సిందిగా కోరితే.. "ఆ రోజుల్లో నాన్నగారు భైరవద్వీపం సినిమాకు డైరక్షన్ చేస్తే... అందులో నేను, రోజా నటించాం" అంటూ చేతులు తిప్పుతూ బాలయ్యలా హావభావాలు ప్రదర్శించారు. దీంతో అక్కడున్న వారంతా టపీమని నవ్వేశారు. అయితే బాలయ్యను అనుకరిస్తూ రోజా ఈ విధంగా కామెంట్లు చేయడంతో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఈ వీడియోను చూసిన నందమూరి అభిమానులు రోజా తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యకు బహిరంగంగా తాను క్షమాపణలు చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే కేవలం హాస్యస్పదం కోసమే రోజా ఇలా ప్రవర్తించిందని.. బాలకృష్ణపై తనకు ఎటువంటి వ్యతిరేకం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని అంతగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మరి ఈ విషయంపై బాలయ్య, రోజా స్పందన ఎలా వుంటుంది వేచి చూడాల్సిందే!


AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress roja  balakrishna  roja balakrishna  ap assembly  

Other Articles