Anjali comments on badminton player pv sindhu in wow show

telugu actress anjali, anjali latest news, anjali latest interview, anjali movies, geethanjali movie, anjali in wow show, anjali movie news, anjali comments pv sindhu, badminton player sindhu

anjali comments on badminton player pv sindhu in wow show

బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధుపై అంజలి నోటిదురుసు..?

Posted: 09/02/2014 06:45 PM IST
Anjali comments on badminton player pv sindhu in wow show

(Image source from: anjali comments on badminton player pv sindhu in wow show)

‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’’ ద్వారా టాలీవుడ్ సీతమ్మగా పేరు సంపాదించుకున్న అంజలీ.. తనలో దాగివున్న మరో కోణాన్ని చివరికి బయటపెట్టేసింది. ఇన్నాళ్లవరకు ఒక సైలెంట్ అమ్మాయిలా, తన పని తాను చేసుకుంటూపోయే ఈ అమ్మడు.. ఒక్కసారిగా తన అసలు రూపాన్ని బయటపెట్టి అందరినీ షాక్ కు గురించి చేసింది. ‘‘చివరికీ అంజలీలాంటి ఒక తెలుగమ్మాయి కూడా ఇలా ప్రవర్తిస్తుందా..?’’ అంటూ అందరూ నోళ్లవెళ్లబెట్టేసుకున్నారు.

అసలు జరిగిన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం అంజలీ ప్రధాన పాత్రలో నటించిన ‘‘గీతాంజలి’’ మూవీ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే! దీంతో ఫుల్ ఖుషీగా వున్న సదరు మూవీ యూనిట్ తోపాటు అంజలీ కూడా కొన్ని ఫంక్షన్లలో, తెలుగులో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సాయికుమార్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్నా ‘‘వావ్ 2’’ కార్యక్రమంలో ‘‘గీతాంజలి’’ చిత్రం యూనిట్ పాల్గొంది. అప్పటివరకు చాలా సైలెంట్ గా వున్న అంజలి... తాను చేసిన అల్లరిని చూసి సాయికుమార్ కూడా షాకయ్యాడు. అంజలీలో కూడా హీరోయిన్లలాగే ఒక అల్లరిపిల్ల దాగుందని అంతా అనుకున్నారు.

అంతేకాదు.. ఈ షోలోనే అంజలి తనలో దాగివున్న మరో కోణాన్ని బయటపెట్టేసింది. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు గౌరవంగా పలకరించే అంజలి... ఈసారి తన నోటిదురుసును బయటపెట్టేసింది. అదికూడా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన సింధుపై ఈ అమ్మడు నోరుపారేసుకుంది. ఆటలో భాగంగా సాయికుమార్ అంజలిని ఒక ప్రశ్న వేయగా.. అందుకు ఆమె నేరుగా ‘‘సింధు’’ పేరు చెప్పకుండా.. ‘‘‘మనకున్నదే ఇద్దరు.. ఒకరు సానియా. ఇంకోక అమ్మాయి ఎవరే అది.. అది కూడా అలాగే వస్తది’’ అంటూ సింధూని అవమానించేసింది. దీంతో ఈ విషయంలో అంజలి వ్యవహారం అంతగా బాగోలేదని కొంతమంది సినీవిశ్లేషకులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

ఎవరిదైనా పేరు తెలియకపోతే తెలియనట్లుగానే వుండాలి కానీ.. ఇలా ‘‘అది ఇది’’ అనడం ఎంతో అవమానకరమంటూ అంటున్నారు. ఇక్కడ అంజలి అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నట్టు అనుకొని వుండొచ్చు కానీ.. ఒక జాతీయ క్రీడాకారిణి వ్యవహారంలో మాత్రం ఎక్కువ ఓవరాక్షన్ చేసిందంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే తెలుగు చిత్రపరిశ్రమలో తెలుగ హీరోయిన్ల కొరత ఎక్కువగా వున్న నేపథ్యంలో అంజలి ఇలా ప్రవర్తించడం అంతా కరెక్ట్ కాదని అంటున్నారు. ఏదేమైనా.. అంజలి మరోసారి తన నోటిదురుసుతో వివాదాస్పదంగా మారిపోయిందనే చెప్పుకోవాలి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anjali  badminton player pv sindhu  wow show  telugu actresses  tollywood  

Other Articles