Akshara hasan entry into movies

akshara hasan, akshara hasan movies, dhanush, dhanush latest movies, sruthi hasan, sruthi hasan movies, sruthi hasan hot, sruthi hasan latest movies, kamal hasan, kamal hasan movies, kamal hasan wiki, kamal hasan family, kamal hasan profile, telugu news, latest updates, tollywood news, bollywood news

sruthi hasan sister akshara hasan enters into movies : akshara hasan doing movie with dhanush comments on akshara

అక్క కంటే చెల్లి అదుర్స్ !!

Posted: 08/13/2014 06:32 PM IST
Akshara hasan entry into movies

హసన్ ఫ్యామిలీ నటనకు పెట్టింది పేరు. భారత సినీ ఇండస్ర్టీలోనే లెజెండ్రీ నటుడుగా కమల్ హాసన్ నిలవగా.., ఆయన కుమార్తె శ్రుతి హాసన్ కూడా ఆ పేరు నిలబెడుతున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి మరో కలికుతురాయి బయటకు వచ్చింది. ఆమె శ్రుతి చెల్లెలు, కమల్ రెండవ కూతురు పేరు అక్షర హాసన్. బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు అప్పుడే ధనుష్ తో ఓ మూవీ కూడా చేస్తోంది. నటన గురించి సినిమా చూస్తే తెలుస్తుంది కానీ.., అక్షర అందం గురించే అంతా చర్చించుకుంటున్నారు. అందం విషయంలో అక్క ఆరు ఆకులు చదివితే చెల్లి నాలుగు ఆకులు ఎక్కువే చదివిందట. శ్రుతి కంటే అక్షర చాలా బాగుందని అనుకుంటున్నారంతా. ఇంతకీ ఆమె ఫొటో సెషన్ ఎప్పుడు పెట్టిందనా సందేహం. అదేమి లేదు.., సరదాగా తీసిన ఫొటోలే సినిమా యూనిట్ అప్ లోడ్ చేసింది.

హీరో ధనుష్ తో అక్షర ఓ సినిమా చేస్తోంది. ఆర్ బాల్కీ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. షమితాబ్ అని టైటిల్ ఖరారైన ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే అమితాబ్ విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించి సెట్ లో అక్షరని సినిమా యూనిట్ ఫొటో తీసింది. వెంటనే నెట్ లో అప్ లోడ్ చేసింది. దీంతో ఇప్పుడీ స్టిల్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. హాసన్ అభిమానులు దీనిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. శ్రుతిలాగే కలువ కళ్ళతో పాటు అందంలో అక్కను మించిపోయిందని అనుకుంటున్నారు. సినిమా రిలీజ్ కాకముందే ఇలా చర్చించుకుంటుంటే.., రిలీజ్ అయితే మరిన్ని ఆఫర్లు రావటం ఖాయమని ఇండస్ర్టీ టాక్. అంతేకాదు అక్కను బీట్ చేసి ఆఫర్లు కొట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదట. ఇదే జరిగితే శ్రుతి హాసన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. చెల్లి బాగుపడుతుంది కదా అని సంతోషిస్తుందా.., తనకు క్రేజ్ తగ్గుతుందని భయపడుతుందా అనేది తెలియాలంటే శ్రుతి నోరు విప్పాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akshara hasan  sruthi hasan  dhanush  latest movies news  

Other Articles