Tapsee pannu facebook account likes crossed 3 millions 30 lakhs

tapsee pannu, tapsee latest news, tapsee facebook account, tapsee latest photo shoot, tapsee latest hot photos, tapsee pannu facebook account, tapsee pannu movies, tapsee pannu telugu movie, tapsee pannu tamil movie, tapsee pannu bollywood movies

tapsee pannu facebook account likes crossed 3 millions (30 lakhs) : Tollywood punjabi hot actress tapsee pannu facebook account likes crossed 30 lakhs

వామ్మో! తాప్సీ 30 లక్షల మందితో కొట్టించుకుంది!

Posted: 08/14/2014 10:45 AM IST
Tapsee pannu facebook account likes crossed 3 millions 30 lakhs

(Image source from: tapsee pannu facebook account likes crossed 3 millions (30 lakhs))

టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్లు లేనిపోని కామెంట్లు చేసి.. చిత్రపరిశ్రమలో వున్నసినీప్రముఖులతోపాటు అభిమానుల విమర్శల దాడికి గురవుతారు. మరికొంతమంది దారుణంగా ప్రవర్తిస్తే మాత్రం.. అటువంటివారిని ఎక్కడబడితే అక్కడ దాడిచేయడం మొదలుపెట్టేస్తారు. అలాకాకుండా కొంతమంది తారలు అప్పుడప్పుడు సేవాకార్యక్రమాలు చేస్తూ.. చిన్నపెద్దా అని తేడాలేకుండా అందరితో ఒదిగిపోతూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకుంటారు. ఈ తరహా తారల సినిమాలు రాకపోయినా.. అభిమానులు మాత్రం వారిని ఎప్పటికప్పుడూ ఊరేగిస్తూనే వుంటారు. ఈ విషయాలను పక్కనపెడితే.. తాజాగా సొట్టబుగ్గల సుందరి తాప్సీకి ఏకంగా 30 లక్షల మంది కొట్టారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇక్కడ కొట్టింది నేరుగా తాప్సీకి కాదులెండి... ఆమె ఫేస్ బుక్ అకౌంట్ కి ‘‘లైక్స్’’ కొట్టారు.

టాలీవుడ్ ఎంట్రీ అయినప్పటికీ ఈ అమ్మడు తన జోరును ప్రదర్శిస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది. ఈ అమ్మడు తన హాట్ అండ్ సెక్సీ లుక్స్ తో ప్రేక్షకజనాలతోపాటు సినీప్రముఖుల్ని సైతం తన బుట్టలో పడేసుకుంది. దీంతోపాటు ఈ భామలో మాంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా వున్నాయనే పొగడ్తలను పొగేసుకుంది. దీంతో ఈ అమ్మడికి ఆఫర్ల వర్షం కురవడం మొదలయ్యింది. అందులో దాదాపు అన్ని సినిమాలు పరాజయం పాలయినప్పటికీ ఈమెకు మాత్రం ఆఫర్లు ఒకదాని మీద ఒకటి వచ్చాయి. అయితే ఆ సినిమాలు కూడా మరీ దారుణంగా ఫెయిల్ అయిపోవడంతో ఆ తర్వాత ఈమెకు ఆఫర్లు కరువయిపోయ్యాయి. కానీ ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గినట్లుగా కనిపించడం లేదని తాజా వార్తల ప్రకారం తెలుస్తోంది.

ప్రస్తుతం ఈమె కెరీర్ గాడిలో పడిన నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి మకాం మార్చుకున్నప్పటికీ.. ఈమె అందానికి ఫిదా అయిన ఫ్యాన్స్ మాత్రం ఈమెను వదిలిపెట్టడం లేదు. ఈమె నటించిన తెలుగు, తమిళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడినా.. ఈమె అభిమానుల సంఖ్య పెరిగిపోతూనే వుంది. ఈ విషయాన్ని తాజాగా ఈమె ఫేస్ బుక్ అకౌంటే రుజువు చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫేస్ బుక్ అకౌంట్ మూడు మిలియన్ (30 లక్షలు) లైక్స్ ను మించిపోయింది. ఇన్ని లైక్స్ వచ్చిన సందర్భంలో ఈ భామ సంబరపడిపోతూ తన అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది. సినిమాలు లేకపోయినా.. ఫ్యాన్స పొగేసుకుని ఏకంగా 30 లక్షలమందితో తన ఫేస్ బుక్ అకౌంట్ కి లైక్స్ కొట్టించుకుంది ఈ పంజాబీ హాట్ బామ!

తెలుగులో సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ కి వెళ్లిన ఈ అమ్మడికి.. అక్కడ వెళ్లగానే ఓ ఆఫర్ లభించింది. అందులో తాప్సీ తన అందాలను పూర్తిగా ఆరబోయడం ఖాయమని, ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి బికినీ ఫోటోషూట్ కూడా ఇచ్చేసిందని సదరు మూవీ యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. తాప్సీ కూడా ఎగ్సైట్ మెంట్ తో తనకు వచ్చిన ఈ మూవీ ఆఫర్ గురించి తన ఫ్రెండ్స్ తో చెప్పుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles