Sreesanth villain role against junior ntr in puri jagannath movie

sreesanth latest news, sreesanth news, junior ntr news, junior ntr puri jagannath movie, junior ntr puri jagannath news, junior ntr sreesanth, junior ntr sreesanth puri jagannath

sreesanth villain role against junior ntr in puri jagannath movie : Indian spot fixer bowler sreesanth to act in puri jagannath movie as villain role opposite to young tiger ntr

స్పాట్ ఫిక్సర్ తో గొడవ పడుతున్న జూ.ఎన్టీఆర్!

Posted: 08/13/2014 06:03 PM IST
Sreesanth villain role against junior ntr in puri jagannath movie

ఆమధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన భారత బౌలర్ శ్రీశాంత్ తో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొడవ పడుతున్నాడు. అయితే ఇది నిజజీవితంలో కాదులెండి... సినిమాలో హీరోగా ఎన్టీఆర్ నటిస్తుంటే అతనికి అపోజిట్ లో విలన్ గా శ్రీశాంత్ నటిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది. క్రికెట్ మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన ఆటగాడు ఎన్టీఆర్ కు విలన్ గా ఎలా సూట్ అవుతాడని కొంతమంది ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.

క్రికెట్ కెరీర్ పూర్తిగా క్లోజ్ అయిపోయి ఖాళీగా కూర్చున్న శ్రీశాంత్ సినిమాల మీద ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే ఇతను తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నాడని.. అందువల్లే అతను హైదరాబాద్ కు వచ్చాడని వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే శ్రీశాంత్ మన టాలీవుడ్ డైరెక్టర్స్ మధుర శ్రీధర్, పూరీ జగన్నాథ్ ను కలిశాడు. ఈ విషయాన్ని స్వయంగా శ్రీశాంత్ కూడా చెబుతూ ట్విటర్ లో వారితో దిగిన ఫోటోలను కూడా అప్ లోడ్ చేశాడు. ఈ ఇద్దరితో సంభాషణల ముగిసిన అనంతరం మధుర శ్రీధర్ తో ప్రాజెక్ట్ ఓకే అయిందని తెలిపాడు కానీ... పూరీ జగన్నాథ్ తో జరిగిన సంభాషణల విషయం గురించి వెల్లడించలేదు.

ఇదిలావుండగా.. ఇప్పుడు తాజాగా శ్రీశాంత్, పూరి జగన్నాథ్ సినిమాలో ఎన్టీఆర్ కు విలన్ గా నటిస్తున్నాడని వార్తలు షికార్లు చేస్తున్నాయి. టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే తాను బ్రేక్ సాధించాలని.. అందుకే పూరి జగన్నాథ్ తో కలిసి మంతనాలు జరిపిన అనంతరం విలన్ గా రోల్ సంపాదించాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయితే శ్రీశాంత్ తన సినిమాలో విలన్ గా నటించడానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా..? ఒకవేళ ఒప్పుకున్న ఆయన అభిమానులు శ్రీశాంత్ ను విలన్ గా అంగీకరిస్తారా..? ఎన్టీఆర్ లాంటి యంగ్ టైగర్ కు ఇతను విలన్ గా సరిపోతాడా..? అంటూ రకరకాలగా చర్చలు మొదలుపెట్టేశారు. మరీ ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలియనుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sreesanth  junior ntr  director puri jagannath  sreesanth junior ntr  

Other Articles