Actress samantha adopted new family member twitter controversial

samantha, samantha latest news, samantha family members, samantha dog story, samantha twitter, twitter controversials, samantha movies, samantha fans, samantha news, samantha hot photo shoot

actress samantha adopted new family member twitter controversial : the south indian hot actress samantha adopted a small dog and posted it on twitter by saying that a new family member has entered in their family which goes cotroversial

నా కుటుంబసభ్యుడు ఎంతో సంతృప్తినిచ్చాడు! సమంత

Posted: 08/09/2014 05:29 PM IST
Actress samantha adopted new family member twitter controversial

ట్విటర్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిత్యం వార్తల్లోకెక్కే సౌత్ ఇండస్ట్రీ గ్లామర్ డాల్ సమంత.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్విటర్ లో పోస్ట్ చేసింది. తన ఇంట్లో ఒక కొత్త కుటుంబసభ్యుడు వచ్చాడని.. అతను తనని ఎంతో సంతృప్తినిచ్చాడని ఆమె అందులో వెల్లడించింది. స్వయంగా సమంత ఈ వార్తను పేర్కొనడంతో ఇది సంచలనంగా మారింది. ఒకవైపు సిద్ధార్థతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి పెళ్లి పీటలదాకా వచ్చిన వీరి ప్రేమాయణంలో ఈ మూడో కుటుంబసభ్యులు ఎవరొచ్చారా..? అంటూ అందరూ ఆరాతీయడం మొదలుపెట్టేశారు. బహుశా సమంత ఇంకొకరితో ప్రేమాయణం నడుపుతుందా అనే రూమర్స్ వస్తున్న తరుణంలో సమతా ఇంట్లో వున్న ఆ కుటుంబసభ్యుని గురించి విషయాలు తెలిపింది.

ఈమధ్యే సమంత తన ఖరీదైన కార్లో చెన్నై రహదారుల్లో ప్రయాణిస్తుండగా.. ఒక అమానుష స్థలంలో ఓ అందమైన కుక్కపిల్ల ఈమెకు కనిపించిందట! అది ఎంతో క్యూట్ గా వుండటంతో వెంటనే తన కారుని ఆపి.. ఆ కుక్కను తన ఇంటికి తీసుకెళ్లిందని తెలిపింది. ఈ విషయాన్నే తాను పూర్తిగా విశ్లేషిస్తూ.. ‘‘నేను ఆ కుక్కపిల్లను చూసిన వెంటనే లవ్ లో పడిపోయాను. అది నాకు ఎంతో బాగా నచ్చింది. అందుకే.. అప్పటికప్పుడే ఆ కుక్కపిల్లను దత్తత తీసుకున్నాను. దాని పేరు ‘‘నోరి’’. హీ ఈజ్ సో క్యూట్!’’ అని ట్వీట్ చేస్తూ.. దానికి ‘‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’’ అనే ట్యాగ్ కూడా తగిలించింది. ఆ కుక్కుపిల్ల దత్తత కార్యక్రమాన్ని తన కుటుంబసభ్యులు అంగీకరించినందుకు తానెంతో సంతోషంగా వున్నానని.. వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నానని ఈ అమ్మడు పేర్కొంది.

dog-named-NORI

ఈ విధంగా ఆమె విశ్లేషించిన వెంటనే.. ‘‘నువ్వు చాలా మంచి పనిచేశావ్ సమంత! వీ ఆర్ అప్రిషియేటింగ్ యూ’’ అంటూ అభినందిస్తూ రీ-ట్వీట్ చేయడం మొదలుపెట్టేశారు. వీరితోపాటు నటి త్రిష కూడా కలిసి సమంత చేసిన మంచి పనిని బాగా పొగిడేసింది. ఇలా ఈ విధంగా సమంత తన ఇంట్లో వున్న కుటుంబసభ్యుని గురించి అందరికీ విశ్లేషించి.. అందుకు మరింత అభిమానాన్ని పొందింది. మరి ఈ విషయంపై ఆమె బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ ఇంతవరకు స్పందించలేదు. దీంతో అతను ఏం ట్వీట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles