Zarine khan ready to do item song in tollywood

zarine khan latest news, zarine khan hot photos, zarine khan fashion show, zarine khan movie, zarine khan hyderabad fashion show, zarine khan salman khan, zarine khan item songs

Zarine khan ready to do item song in tollywood : bollywood hot actress zarine khan is ready to do item songs in telugu movies.

ఛీఛీ అంటూనే.. ముంబై పిల్ల ఒప్పేసుకుంది!

Posted: 08/09/2014 01:27 PM IST
Zarine khan ready to do item song in tollywood

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన ‘‘వీర్’’ సినిమాలో తళుక్కుమని మెరిసిన ముంబై ముద్దుగుమ్మ జరీన్ ఖాన్... జూనియర్ కత్రినా కైఫ్ గా పేరు నమోదు చేసుకుంది. మొదట ఆ సినిమాలో ఈమెను చూసిన ప్రతిఒక్కరు కత్రినా కైఫే అంటూ దాదాపు ఫిక్స్ అయిపోయారు. మరికొంతమంది కత్రినా కైఫ్ కొంచెం బొద్దుగా తయారయ్యిందని కామెంట్లు కూడా చేశారు. కానీ చివరగా ఆమె కత్రినా కాదని తేలిపోయింది. అయితే ఆరోజు నుంచి మాత్రం ఈమెను జూనియర్ కత్రినా కైఫ్ గా పరిగణించడం మొదలుపెట్టేశారు. ఆ దెబ్బతో ఈమెకు సినిమా అవకాశాలు వస్తాయని ఈమెతోపాటు అందరూ భావించినా.. అలా జరగలేదు. ఏదో అప్పుడప్పుడు చిన్నాచితకా సినిమాలు, ఐటమ్ సాంగ్ లు చేసుకుంటూ కాలం గడుపుతోంది.

ఇదిలావుండగా.. తాజాగా హైదరాబాద్ నోవాటెల్ లో హైచ్ఐసీసీలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో కనువిందు చేసి, అందరినీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే ఆమె మీడియా ప్రతినిథులతో కాసేపు ముచ్చటించింది. తన సినిమా కెరీర్ కు సంబంధించి కొన్ని విషయాలను చెప్పిన జరీన్ ఖాన్... ‘‘మీరు తెలుగులో ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీయేనా..?’’ అన్న ప్రశ్నకు.. ‘‘ఛీఛీ.. నేను ఇక ఐటమ్ సాంగ్స్ చేయను’’ చెప్పింది. ‘‘రెడీ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ఢీలా ఐటమ్ సాంగ్ కేవలం సల్మాన్ ఖాన్ కోసం మాత్రమేనని.. అంతేగానీ ఐటం సాంగ్స్ చేయడం ఇష్టం లేదని’’ ఆమె తేల్చి చెప్పింది. మరీ తమిళంలో ఎందుకు చేశావ్..? అని అడిగితే.. ‘‘ఆ పాట నాకు పిచ్చపిచ్చగా నచ్చింది. అందుకే చేశాను’’ అని చెప్పింది.

ఇంతవరక బాగానే వుంది కానీ.. ఈ అమ్మాయి ఏమనుకుందో ఏమో.. సడెన్ గా ఫ్లేటు ఫిరాయించింది. జీవితంలో ఐటమ్ సాంగులే చేయను బాబోయ్ అని స్పష్టం చేసిన ఈ భామ.. తెలుగులో ఐటెం నెంబర్ చేయడానికి రెడీ అని ఒప్పేసుకుంది. టాలీవుడ్ లో ఛాన్స్ వస్తే నేను తప్పకుండా నటిస్తాను. అది ఐటెం సాంగ్ అయినా సరే, కానీ మంచి గుర్తింపు తెచ్చేదిగా వుండాలి’’ అని కండిషన్ పెడుతూ ఐటం సాంగ్ లకు సై అని ఒప్పేసుకుంది. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోతో పాటు జరీన్ ఖాన్ అన్ని ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోల్లో కూడా తరుచుగా పాల్గొంటోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Hit sneak peek provides chills and thrill in equal doses

  విశ్వక్ సేన్ ‘‘హిట్’’ స్నీక్‌పీక్‌.. చూశారా?

  Feb 25 | ఫలక్ నుమా దాస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విశ్వక్‌సేన్‌ నాయుడు తాజాగా హిట్ చిత్రం ద్వారా వస్తున్నాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్.. కీలక పాత్రలో నటిస్తున్నాడు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న... Read more

 • Nani s v secret behind the killer drama s title revealed

  ‘వి’ లో నానీ నెగిటివ్ రోల్ సీక్రెట్.. ట్విస్టు ఉందట

  Feb 24 | న్యాచురల్‌ స్టార్‌ నాని, యువహీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వి’ చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపోందిస్తున్న విషయం తెలిసిందే. ఈ దర్శకుడు ఇటు నానీకి .. అటు సుధీర్ బాబుకి... Read more

 • Crucial action sequences of naarappa will be an added advantage

  నారప్పలో యాక్షన్ సీన్స్.. పత్యేక ఆకర్షణ

  Feb 24 | శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా రూపొందుతోంది. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ విభిన్నమైన లుక్ తో... Read more

 • Varun tej s boxing film goes on floors to release on this date

  ‘బాక్సర్’గా రంగంలోకి దిగిన మెగా ప్రిన్స్

  Feb 24 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ తో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న తరువాత తాజాగా కిరణ్ కొర్రపాటి ఒక సినిమాలో నటిస్తున్నాడు. బాక్సార్ గా టైటిల్... Read more

 • Disha patani s bodyguard pushes photographer and gets into fight

  వీడియో: ఫొటోగ్రాఫర్ ను తోసేసిన దిశా పటానీ బాడీగార్డ్

  Feb 24 | సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే, వాళ్లతో సెల్ఫీలు దిగాలని చూసేవారు, వారి రూపాలను క్లిక్ మనిపించాలని చూసే ఫొటోగ్రాఫర్లు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. ఒక్కోసారి వీరి ప్రవర్తన సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంది కూడా.... Read more

Today on Telugu Wishesh