Kangana ranaut increases remuneration

kangana ranaut remuneration, kangana ranaut latest news, kangana ranaut hikes remuneration, kangana ranaut hot photo shoot, kangana ranaut queen movie, kangana ranaut hike 50 percent remuneration, kangana ranaut press meet remuneration, kangana ranaut remuneration press meet, kangana ranaut comments on remuneration, kangana ranaut news

Kangana Ranaut remuneration : bollywood hot actress kangana ranaut increases her remuneration 50 percent for getting continous offers and success

ఓలమ్మో! మరీ ఇంతగా పెంచితే ఎలా కంగనా..?

Posted: 08/01/2014 05:15 PM IST
Kangana ranaut increases remuneration

బాలీవుడ్ ‘‘క్వీన్’’గా పేరు సంపాదించుకున్న కంగనా రనౌత్ తాజాగా మరో సెన్సేషన్ న్యూస్ తో వార్తల్లోకెక్కింది. నిన్నమొన్నటివరకు వరుసగా సినిమాలు చేసుకుంటూ కాలం గడిపిన ఈ అమ్మడు.. ఇప్పుడు సడెన్ గా వాటికి చెక్ పెట్టి దర్శకనిర్మాతలకు దిమ్మతిరిగిపోయేలా స్టేట్ మెంట్ ను విడుదల చేసింది. సెక్సీ లేడీ కంగనా ప్రెస్ మీట్ పెట్టి.. ‘‘నేను నా ఫీజును 50 శాతం ఎక్కువగా పెంచుతున్నాను’’ అని ప్రకటించేసింది. దీంతో షాక్ కు గురైన నిర్మాతలు... ‘‘ఓలమ్మో! మరీ ఇంతలా పెంచేస్తే ఎలా..?’’ అని ప్రశ్నిస్తూ ఆందోళనల్లో పడిపోయారట!

కంగనా ప్రకటించిన ఈ స్టేట్ మెంట్ మీద కొంతమంది విమర్శలు గుప్పిస్తే.. మరికొంతమంది ఈమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ‘‘ఎన్ని హిట్లు సాధించినా మరీ ఇంతగా పెంచాలా..?’’ అని కొంతమంది విమర్శించడం మొదలుపెట్టేశారు. అయితే మరికొంతమంది మాత్రం ‘‘కొందరు హీరోయిన్లకు సరిగ్గా హిట్లు లేకపోయినా, చేతినిండా ఆఫర్లు లేకపోయినా కూడా రెమ్యునరేషన్లు పెంచేస్తుంటే... వరుసగా మూడు భారీ హిట్లతోపాటు రెండు అవార్డ్ విన్నింగ్ స్టంట్లతో అదరగొట్టేసిన సెక్సీ లేడీ కంగనా తన రెమ్యునరేషన్ లో పెంచడంలో తప్పేముంది..?’’ అని ఈమెకు మద్దతుగా ప్రశ్నించడం మొదలుపెట్టారు.

‘‘క్వీన్’’ సినిమా ఇంకా హిట్టవ్వకముందు కంగన ఎంత బాగా నటించినప్పటికీ ఆమె యాక్టింగ్ స్కిల్స్ గురించి అప్పట్లో ఎవ్వరు పట్టించుకోలేదు. గ్లామర్ పరంగా ఓ రేంజిలో రెచ్చిపోయి బికినీలు వేసుకున్న కూడా ఈమెకు ఆఫర్లు ఇవ్వడానికి ఏ ఒక్క నిర్మాత ముందుకు రాలేదు. అయితే ‘‘క్రిష్-3’’ సినిమాతో మాత్రం ఈమె దశ తిరిగిపోయింది. ఆ సినిమాలో విలన్ పాత్రను పోషించిన ఈ అమ్మడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి మంచి మార్కులు కొట్టేయడంతో.. ‘‘క్వీన్, రివాల్వర్ రాణి’’ వంటి చిత్రాల్లో నటించే ఛాన్స్ దక్కింది. ఆ రెండు సినిమాలు చేస్తూనే.. న్యూయార్క్ లో ఫిలింమేకింగ్ కోర్సు కూడా నేర్చేసుకుంది. ఆ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను సాధించడంతో ఈమె తన ఫీజును 50 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించేసింది.

‘‘అవును.. నేను నా రెమ్యునరేషన్ ను 50 శాతం వరకు పెంచాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే.. మిగతా స్టార్ హీరోయిన్లలాగా నాక్కూడా మంచి విజయాలు దక్కాయి. ‘‘క్వీన్’’ లాంటి లేడీ ఓరియేంటెడ్ సినిమా కూడా భారీ కలెక్షన్లు వచ్చాయంటే.. అందులో నా పాత్రే ముఖ్యం కాబట్టి! పైగా ఫిలింమేకింగ్ విభాగాల్లో ఇతర విషయాల గురించి కూడా నేర్చుకున్నాను. గతంలో కంటే ఇప్పుడు నన్ను నేను బాగానే ఇంప్రూవ్ చేసుకున్నాను. అందుకే నా ఫీజును 50 శాతానికి పెంచుతున్నాను’’ అని నిస్సిగ్గుగా ప్రకటించేసింది. ఇప్పటివరకు ఈ అమ్మడు కథను బట్టి 1 నుంచి 2 కోట్లు డిమాండ్ చేసేది.. మరి ఇప్పుడు ఎంతవరకు తీసుకోబోతోందో..?!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles