Shah rukh planning to remake pawan kalyan attarintiki daredi

shah rukh khan latest news, shah rukh in attarintiki daredi movie, attarintiki daredi movie news, attarintiki daredi movie photos, shah rukh khan with pawan kalyan, pawan kalyan with shah rukh khan, attarintiki daredi movie remake in bollywood, shah rukh khan plans to remake attarintiki daredi movie, shah rukh khan in happy new year movie, shah rukh khan latest movie news, shah rukh khan news, pawan kalyan latest news

Attarintiki daredi movie review : Bollywood baadshah is planning to remake pawan kalyan's attarintiki daredi movie soon

పవన్ ‘‘అత్త’’ వెంటపడుతున్న షారుఖ్ ఖాన్

Posted: 08/01/2014 10:44 AM IST
Shah rukh planning to remake pawan kalyan attarintiki daredi

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా వుందో అందరికీ తెలిసిన విషయమే! కేవలం టాలీవుడ్ లోనే కాదు.. యావత్తు భారతదేశం మొత్తం మీదున్న ప్రేక్షకాభిమానుల నుంచి సినీ ప్రముఖుల దాకా ఈయనకు ఎంతోమంది ఫ్యాన్స్ వున్నారు. ఈయన పేరు వినబడితే చాలు.. అభిమానులు జేజేలు కొట్టుకుంటూ నినాదాలు చేస్తారు. ఈయనతో కరచాలనం చేయడానికి కొన్నివేలమంది ప్రముఖులు కూడా క్యూలో నిలబడి వెయిట్ చేస్తారు. అయితే వీరందరికి భిన్నంగా బాలీవుడ్ బాద్ షా  - కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. పవన్ ‘‘అత్త’’ వెంటపడుతున్నాడు. ఇందుకు అతను పవన్ కల్యాణ్ ను కూడా సంప్రదించినట్టు తాజా సమాచారం!

అయితే తొందరపడి మరోవిధంగా అర్థం చేసుకోకండే.. ఇక్కడ పవన్ ‘‘అత్త’’ అంటే.. ఆయన నటించిన ‘‘అత్తారింటికి దారేది’’ సినిమా గురించి! పవన్ కల్యాణ్ చరిత్రలోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిపోయిన ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు షారుఖ్ ఖాన్ సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్టుగా ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. సహజంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో స్ర్కిప్ట్ అంతగా చెప్పుకోదగినది కాకపోయినా... ఇందులో వున్న డైలాగులు, మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిస్తే... మొత్తం చిత్రానికి మాత్రం పవన్ కల్యాణ్ పర్ ఫార్మెన్స్ మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా అర్థం చేసుకోవాల్సిందే! ఆయన ఆదరణతోనే ఈ సినిమా చరిత్ర రికార్డుల్లోకెక్కింది.

దీంతో ఈ సినిమా హిందీ హక్కుల్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని బాలీవుడ్ లో హీరోలు ఎగబడి మరీ పోటీపడుతున్నారు. అయితే ఇందులో ప్రస్తుతం ప్రముఖంగా పేరు వినబడుతోంది మాత్రం బాలీవు్ బాద్ షా షారుఖ్ ఖాన్ దే! ఇప్పటికే సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లు తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలను రీమేక్ చేసి బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా విజయాలను సాధించారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా వారిబాటలోనే నడుస్తూ ఏదో ఒక సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో పడిపోగా... ‘‘అత్తారింటికి దారేది’’ దగ్గర బ్రేక్ వేశాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ సినిమాను తన సొంత బ్యానర్ లోనే రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడని, అన్ని సవ్యంగా కుదిరితే త్వరలోనే ఈ మూవీ రీమేక్ అయ్యే అవకాశాలు వున్నాయని వార్తలు వస్తున్నాయి.

ఇదిలావుండగా.. హిందీ వెర్షన్ మూవీ కోసం షారుఖ్ ఖాన్ మరో కొత్త డైరెక్టర్ ను సంప్రదించకుండా.. ఆ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించిన త్రివిక్రమ్ నే హిందీలో కూడా దర్శకత్వం వహించాల్సిందిగా షారుఖ్ కోరినట్టు ఇన్ సైడ్ టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం తెలుగులో రెండు ప్రాజెక్టులను అనౌన్స్ చేసిన త్రివిక్రమ్... ఈ హిందీ వెర్షన్ అత్తారింటిని తెరకెక్కిస్తాడో లేదో తెలియదు కానీ... షారుఖ్ ఖాన్ మాత్రం రీమేక్ చేయాలని పక్కాగా ఫిక్స్ అయినట్టు బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. ఒకవేళ షారుఖ్ ఈ సినిమాను తెరకెక్కిస్తే.. పవన్ ఏవిధంగా తెలుగు ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడో.. షారుఖ్ కూడా ఇస్తాడా లేదా..? అనేది వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles