Sai kumar in gopala gopala movie

sai kumar pawan kalyan, sai kumar gopala gopala, gopala gopala movie news, sai kumar swamyji character, sai kumar special character gopala gopala movie, sai kumar in gopala gopala, sai kumar with pawan kalyan, sai kumar to act with pawan kalyan, sai kumar replaced mithum chakravarthy in gopala gopala movie, sai kumar comments on pawan kalyan, sai kumar challenges pawan kalyan

Sai kumar in gopala gopala movie : tollywood actor sai kumar to act with pawan kalyan in gopala gopala movie in swamyji character who creates controversies on gods

పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరిన పోలీస్ అధికారి!

Posted: 08/01/2014 05:30 PM IST
Sai kumar in gopala gopala movie

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఓ పోలీస్ అధికారి ఒక సవాల్ విసురుతున్నారు. తాడోపేడో తేల్చుకోవాల్సిందేనని ఇద్దరూ తలపడటానికి సై అంటున్నారు. అయితే ఇక్కడ ఆ పోలీస్ అధికారి ఎవరో కాదు.. ‘‘పోలీస్ స్టోరీ’’ సినిమాలో ఒక పోలీస్ అధికారిగా పాత్ర పోషించి, టాలీవుడ్ లో తనదైన ప్రత్యేక ఇమేజిని క్రియేట్ చేసుకున్న సాయికుమార్!

పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్ ఇద్దరూ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ సినిమా ‘‘గోపాలా గోపాలా’’! బాలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘‘ఓ మై గాడ్’’ చిత్రాన్ని తెలుగులో ‘‘గోపాలా గోపాలా’’గా రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక నాస్తికుడిగా నటిస్తుండగా.. పవన్ కల్యాణ్ సరికొత్త అవతారంలో మోడ్రన్ కృష్ణుడిగా కనువిందు చేయనున్నాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో వీరిద్దరి మధ్య సాయికుమార్ కూడా చేరిపోయాడు. బాలీవుడ్ ‘‘ఓ మై గాడ్’’ చిత్రంలో మిథున్ చక్రవర్తి పోషించిన స్వామిజీ పాత్రను తెలుగులో సాయికుమార్ నటించనున్నారు.

తొలుత తెలుగు రీమేక్ లోనూ ఆ స్వామిజీ పాత్రకు మిథున్ చక్రవర్తినే తీసుకోవాలని నిర్ణయించిన ఈ చిత్రం యూనిట్ ఆయనను సంప్రదించగా... అందుకు ఆయన అప్పట్లో ఓకే అని కూడా చెప్పేశాడు. అయితే బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా వుండటం వల్ల డేట్స్ కుదరడం లేదని ఆయన తప్పుకున్నాడు. దీంతో ఆయన స్థానాన్ని సాయికుమార్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  actor sai kumar  pawan kalyan gopala gopala movie  

Other Articles