Chakri sings for ravi teja power

Chakri Lend His Voice For Thaman Music, Chakri sings for Thaman, Chakri Sings For Ravi Teja Power, Thaman made Chakri Sing for Power, Chakri with Thaman for Mass Maharaja's power, Chakri Sings In Thaman's Power,

Chakri Sings For Ravi Teja Power: Thaman S S has made this possible. He made another music director Chakri to sing a song in his energetic album for the film 'Power'.

చక్రి సాయం కోరిన థమన్

Posted: 07/29/2014 12:41 PM IST
Chakri sings for ravi teja power

మాస్ మహారాజా రవితేజ, సంగీత దర్శకుడు చక్రి కాంబినేషన్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ చిత్రాలొచ్చాయి. దాదాపు రవితేజ నటించిన చాలా చిత్రాలకు చక్రీయే సంగీతం అందించాడు. అయితే గతకొద్ది కాలంగా రవితేజ సినిమాలకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ హీరోగా నటించిన ‘కిక్’ సినిమాతో తెలుగులో సంగీత దర్శకుడిగా పరిచయమైన థమన్ ప్రస్తుతం తన 50వ చిత్రానికి చేరువయ్యాడు.

ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘పవర్’ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ మాస్ మసాలా పాట ఉందట. ఈ పాటను సంగీత దర్శకుడు చక్రీతో పాడిస్తే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో చక్రీని సంప్రదించాడు థమన్. చక్రి వెంటనే ఒప్పుకోవడం... వచ్చి పాట పాడటంతో పాటు ఆ పాట ట్యూన్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా చేసాడట. దీంతో సాంగ్ బాగా వచ్చిందని థమన్ చాలా సంతోషంతో ఉన్నాడు. ఆ సంతోష విషయాన్ని తన ట్విట్టర్ పోస్ట్ చేసాడు థమన్.

రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కతున్న తాజా చిత్రం ‘పవర్’. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో రవితేజ సరసన హన్సిక, రెజీనాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles