ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయకాంత్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతనెలలో ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐతే అది గుండేనొప్పి కాదని స్వల్ప మైన దేనని చెప్పడంతో అప్పటి వరకు కంగారు పడ్డ కెప్టెన్ అభిమానులు ,కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే అపోలో నుంచి డిశ్చార్జ్ ఐనా తర్వాత విజయకాంత్ సింగపూర్ వెళ్లడంతో మరోసారి అనుమానాలు మొదలయ్యాయి. నిన్న సింగపూర్ నుండి చెన్నైకు చేరుకున్న విజయకాంత్ ఎయిర్ పోర్టు నుంచి వీల్ చెయిర్ లోనే రావడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అసలు విజయకాంత్ కు ఏమైందని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని అభిమానులు, కార్యకర్తలు తెగ ఆరాటపడుతున్నారు.
అయితే విజయకాంత్ ఆరోగ్య వివరాల గురించి ఇంకా ఎలాంటి వార్త వెలువడలేదు. ఈ విషయంపై ఎవరూ కూడా స్పందించకపోవడంతో అభిమానులు చాలా కంగారుపడుతున్నారు. ఉక్కుమనిషిలాగా దిట్టంగా ఉండే తమ అభిమాన నటుడు ఇలా వీల్ చెయిర్ రావడమేంటని అభిమానులు బాధపడుతున్నారు. దీంతో విజయకాంత్ అనారోగ్యంపై రకరకాల కథనాలు వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more