Sudeep to romance rachita ram and hariprriya

Haripriya as Pranitha in Attarintiki Daredi Kannada Remake, Haripriya selected as another Heroine of Attarintiki Daredi, Hari Priya in Attarintiki Daredi remake, Haripriya in Attarintiki Daredi Kannada Remake, Haripriya in Sudeep's 'Attarintiki Daredi' Kannada Remake, Haripriya Selected As Another Heroine Of Attarintiki Daredi, Sudeep to romance Rachita Ram and Haripriya in his next movie, Sudeep to romance Rachita Ram and Hariprriya

Attarintiki Daredi' has two heroines and earlier Rachita Ram was ... Haripriya is finally making a mark for herself in the Kannada film industry after ... in to play the heroine in the remake of 'Attarintiki Daredi' starring Sudeep.

సుదీప్ కు రెండో మరదలు దొరికిందోచ్...!

Posted: 07/29/2014 02:39 PM IST
Sudeep to romance rachita ram and hariprriya

ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ తెలుగులో ఘనవిజయం సాధించిన చిత్రాలపై ఎటాక్ చేస్తున్నాడు. తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రాన్ని కన్నడలో ‘మాణిక్య’ అనే పేరుతో రీమేక్ చేసి, ఇటీవలే విడుదల చేశారు. కన్నడలో ఈ సినిమా మంచి విజయం సాధించి, సుదీప్ కు మరింత పేరును తెచ్చిపెట్టింది. అయితే సుదీప్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేస్తున్నాడు.

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా 2013లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని ప్రస్తుతం కన్నడంలో సుదీప్ రీమేక్ చేస్తున్నాడు. ఇందులో సమంత పాత్రలో హీరోయిన్ గా హన్సిక నటించబోతుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఈ సినిమాలో తాను నటించట్లేదని హన్సిక ఇటీవలే స్పష్టం చేసింది. అయితే ఈ సినిమాలో సమంత పాత్రలో రచిత రాంను ఎంపిక చేసుకోగా... ప్రణీత పాత్రలో హీరోయిన్ హరిప్రియను తాజాగా ఎంపిక చేసారు.

హీరో సుదీప్ తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గతంలో కూడా తాను తన సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఇందులో సుదీప్ కు అత్తగా తమిళ హీరోయిన్ మధుబాల నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం కూడా విడుదలై మంచి ఘనవిజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles