Harassment on anchor reshmi dress code in social networking sites

netizens physical harassment on anchor reshmi, anchor reshmi dress code in social networking sites, anchor reshmi latest news, anchor reshmi news, anchor reshmi hot photos, anchor reshmi attacked by netizens in social networking sites, anchor reshmi fires on fans, anchor reshmi facebook account

netizens physical harassment on anchor reshmi dress code in social networking sites

యాంకర్ రేష్మీని లైంగికంగా వేధించిన అభిమానులు

Posted: 07/28/2014 05:33 PM IST
Harassment on anchor reshmi dress code in social networking sites

‘‘జబర్దస్త్’’ కామెడీ షోతో బుల్లితెర ఫేమస్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న యాంకర్ రేష్మిని అభిమానులు లైంగికంగా వేధించారని తాజా సమాచారం! నీలాంటి చెత్త అమ్మాయిల వల్లే మన భారతదేశంలో రానురాను రేప్ లు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. రెచ్చగొట్టే విధంగా డ్రెస్సులు వేసుకుంటే ఏ మగాడైనా రెచ్చిపోతాడని... నువ్వు కూడా నీ డ్రెస్సులను అదుపులో వుంచుకుంటే చాలామందని ఆమె మీద అభిమానులు ఘాటుగా కామెంట్లు చేశారు. కానీ ఆమెను వేధించింది పబ్లిక్ లో కాదులెండి.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో!

ప్రస్తుతం పాశ్చాతదేశాల సంస్కృతికి అలవాటు పడ్డ మన భారతీయులు.. ఆ తరహాలోనే పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకోవడం, పార్టీలు - పబ్బులు వంటి వాటికి షికార్లు చేయడం కామన్ అయిపోయింది. ఇక చిత్రపరిశ్రమలో అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే యాంకర్ రేష్మీ కూడా చాలా పొట్టిగా వుండే ఒక నిక్కర్ ధరించుకుని వున్న తన హాట్ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. సాధారణంగానే ఈ అమ్మడు అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ చాలా హాట్ గానే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ రచ్చ జరిగింది మాత్రం తాను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసిన పొట్టి నిక్కర్ డ్రెస్ మీదే!

ఈమె తన ఫోటోలను అప్ లోడ్ చేయడమే ఆలస్యం.. బెల్లంకు ఏవిధంగా అయితే ఈగలు వాలుతాయో అదే విధంగా రేష్మీ మీద అభిమానులు ఘాటుగా కామెంట్లు కురిపించారు. ‘‘నీలాంటి అమ్మాయిలు ఈ విధంగా డ్రెస్సులు వేసుకోవడం వల్లే నేడు భారత సంస్కృతి ఇలా దారుణంగా మారిపోయింది. ఆ షార్టులు, తొడలు చూస్తే ఏ మగాడైనా రెచ్చిపోయి రేప్ చేయడం ఖాయం’’ అని భారీ రేంజులోనే కామెంట్లు చేశారు. ‘‘నీకు అంత దురుసుగా వుంటే పెళ్లి చేసుకోవచ్చు కదా’’ అని కామెంట్లు చేసిన కుర్రాళ్లు వున్నారు. ఇలా దాదాపుగా ఈమె మీద 1000పైగా కామెంట్లు చేశారు.

అయితే వీటన్నింటికి అంతే స్పీడుగా రేష్మీ కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ‘‘రేప్ చేయడం అనేది మైండ్ లో వుంటుంది. దుస్తుల్లో కాదు.. రేప్ చేయాలనే దుర్బుద్ధి వున్నవారే అటువంటి అఘాయిత్యానికి పాల్పడుతారు.’’ అని రిప్లై ఇచ్చింది. ఈమె చేసిన ఈ కామెంట్ కి కొందరు మద్దతు పలికారు. రేప్ చేయడమనేది బట్టలను బట్టి కాదు.. మానవుని దురాలోచనల వల్లే అమ్మాయిల దాడి జరుగుతోందని ఆమెకి మద్దతుగా కొంతమంది కామెంట్లు చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. యాంకర్ రేష్మీ కామెంట్ చాలావరకు నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే కేవలం బట్టలను మాత్రమే రేప్ అనేది జరిగితే... నిండుగా డ్రెస్సులు, చీరలు కట్టుకున్న మహిళలు అత్యాచారాలు జరగకూడదు. కేవలం బికినీలు లేదా తమ అంగాలను ప్రదర్శించేలా డ్రెస్సులు వేసుకునే అమ్మాయిల మీదే రేప్ జరగాలి. కానీ ఇలా జరగడం లేదు. అమ్మాయిలు నిండుగా డ్రెస్సులు వేసుకున్నప్పటికీ వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. బికినీ వేసుకోకపోయినా 6 సంవత్సరాల పసికందును సైతం రేప్ చేస్తున్నారు. ఏ అందం లేని 60 సంవత్సరాలు దాటిన వృద్ధుల మీద కూడా మానవమృగాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంటే ఇక్కడ మార్చుకోవాల్సిందే అమ్మాయిలు తమ డ్రెస్ కోడ్ ని కాదు... మన మైండ్ సెట్ ను! అందుకు ఉదాహరణ కూడా పాశ్చాత్తదేశాలే! ఒక్కసారి ఆలోచించి చూడండి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles