Yami goutham revealed her beauty secrets

Yami Goutham revealed her beauty secrets, yami gautham latest news, yami gautham about beauty products, yami gautham interview, yami gautham news, yami gautham beauty secrets, yami gautham movies news, yami gautham hot photos, yami gautham latest photo shoot, yami gautham hot stills, yami gautham hot photo shoot

Yami Goutham revealed her beauty secrets

అందరి ముందు సీక్రెట్ విప్పేసింది!

Posted: 07/14/2014 10:39 AM IST
Yami goutham revealed her beauty secrets

(Image source from: Yami Goutham revealed her beauty secrets)

బుల్లితెరమీద ఫెయిర్ నెస్ క్రీముల యాడ్స్ తో సుపరిచితమైన యామీ గౌతమ్... తన సీక్రెట్ ను అందరి ముందు బయటపెట్టేసింది. తాజాగా ఆమె పాల్గొన్న ఒక ఇంటర్యూలో... ‘‘మీ సౌందర్య రహస్యం ఏమిటి?’’ అని ప్రశ్నిస్తే.. ఎవరూ ఊహించని విధంగా అందరికీ షాక్ తగిలేలా సమాధానమిచ్చింది. ఈ అమ్మడు ఇచ్చిన సమాధానికి ‘‘ఔరా’’ అంటూ అందరూ నోళ్లవెళ్లబెట్టుకున్నారట!

ఈమె పాల్గొన్న ఒక ఇంటర్యూ సందర్భంగా కొంతమంది ఈమెను... ‘‘మీరు ఎన్నోరకాల కాస్మొటిక్ యాడ్ లలో నటించారు. ముఖ్యంగా  ఫెయిర్ నెస్ గురించి చాలానే ప్రచారం చేశారు. కానీ మీరు ఎటువంటి కాస్మొటిక్స్ ఉపయోగిస్తారు..?’’ అని ప్రశ్నిస్తే... ‘‘నేను నా సౌందర్యం కోసం ఎటువంటి ఫెయిర్ నెస్ క్రీములను అస్సలు వాడను’’ అంటూ సమాధానమిచ్చింది. ‘‘మరి మీరు ఇంత అందంగా వుండడానికి కారణమేంటి..?’’ అని అడిగితే.. దానికి బదులుగా ప్రతిరోజూ ఒక మంచి సబ్బుతో ముఖం కడుక్కోవడం, నచ్చిన ఫ్రూట్ జ్యూస్ లు తాగడం, టైముకి తినడం మాత్రమే తాను అందంగా వుండటానికి కారణమంటూ సమాధానమిచ్చింది. అదేవిధంగా ఫెయిర్ నెస్ క్రీములు వాడటం మంచిదే కానీ... అమ్మాయిలు సహజంగానే చాలా అందంగా వుంటారని చెప్పింది!

ఈ అమ్మడు ఇచ్చిన సమాధానంతో అవాక్కయిన వారు.. ‘‘అటువంటి సమయంలో మీరు అందాల పోటీలలో ఎందుకు పాల్గొంటారు?’’ అని అడిగితే.. ‘‘ఏవిధంగా అయితే ఒక పూల తోటలో రకరకాల పువ్వులను చూసి మనం ఆనందిస్తామో... అదేవిధంగా అందంగా వున్న అమ్మాయిలందరూ ఒకేచోటుకి చేరితే చాలా ఆనందంగా వుంటుంది. అందుకే నేను అందాల పోటీలలో పాల్గొంటాను. అందాల పోటీలలో పాల్గొనడంలో ఎటువంటి తప్పు లేదు’’ అని బదులిచ్చింది.

అంటే.. ఏ విధంగా అయితే పువ్వులు రంగురంగుల్లో వుంటూ అందరినీ ఆహ్లాదపరుస్తాయో.. అలాగే అమ్మాయిల సహజ అందం కూడా అందరినీ ఆనందపరుస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. యామీ గౌతమ్. అంతేగానీ అందంగా వుండాలని చెప్పి రకరకాల ఫెయిర్ నెస్ క్రీములు వాడటం అంత మంచిది కాదని ఉచిత సలహాలు ఇచ్చేస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles