Sunny leone secret of success

sunny leone secret of success, Sunny leone porn star history, Silk Smitha itom girl

sunny leone secret of success

సన్నీ లియోన్ విజయరహస్యం!

Posted: 07/13/2014 03:34 PM IST
Sunny leone secret of success

ఎంతోమంది శృంగార తారలు సినీ తెరల మీద ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.  కానీ సన్నీలియోన్ లో ఉన్న ప్రత్యేకతేమిటి, ఆమెతో నటించటానికి నటీ నటులు, ఆమెను తెర మీద చూడటానికి ప్రేక్షకులు ఎందుకు అంత ఇష్టపడతారు అంటే, అది సన్నీ ముఖంలో కనిపించే హావభావాలే! 

చిలిపితనాన్ని అందరు భామలూ చూపిస్తారు కానీ అందులోనూ రెచ్చగొట్టే సన్నివేశంలోనూ ముఖంలో అమాయకత్వం చూపించటమే కాకుండా తనేదో తప్పు చేస్తున్నట్లుగా కానీ, సిగ్గుపడుతున్నట్లుగా కానీ కనిపించకపోవటం విశేషం.

ముఖంలో ఈ రకమైన హావభావాలను పూర్వం సిల్క్ స్మితా కూడా చూపించింది.  ఎంతో ఇష్టంగా, నిష్టగా చేస్తున్నట్లుగా ఉండేదే కానీ ముఖంలో మరేవిధమైన భావాలు కనిపించేవి కావు.  గిల్టీ ఫీలింగ్ అసలే లేదు.  

అయితే సిల్క్ స్మితకూ సన్నీ లియోన్ కున్న పెద్ద తేడా వాళ్ళ గత చరిత్ర.  సిల్క్ స్మితకు లేని పోర్న్ అనుభవం సన్నీకుంది.  అది ఆమెకు ప్లస్ పాయింటే అయింది.  పెద్దలకు మాత్రమే వీడియోల్లో పనిచేసిన సన్నీ లియోన్ సెన్సార్ కత్తెరకు భయపడి సినిమా తెర మీద అంత చూపించకపోయినా, ఆమె ముఖంలో తొణికసలాడే కవళికలు ఆ అనుభవాన్ని ఊహించుకునేలా చెయ్యటమే ఆమె విజయానికి కారణం.  కెమేరా లెన్స్ ద్వారా నేరుగా ప్రేక్షకుల కళ్ళల్లోకి భావగర్భితంగా చూడగలగటమే సన్నీ లియోన్ ప్రత్యేకత, విజయానికి కారణం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles