‘‘నన్ను వాడుకోండిరా బాబోయ్’’ అంటూ మూడుపదుల భామ శ్రియ శరన్ అరుపులు పెట్టడం మొదలుపెట్టిందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. ఒకానొక కాలంలో ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లలో వరుసగా సినిమాలు చేసుకుంటూ టాప్ హీరోయిన్ గా పేరు పొందిన ఈ డెహ్రాడూన్ భామ్... అగ్ర కథానాయకులతో ఆన్ స్ర్కీన్ మీద బాగానే రొమాన్స్ పండించింది. ఇక ఈమెకు ఎవరూ సాటిలేరనే సమయంలో వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దాంతో ఈ అమ్మడు గోల్డెన్ లెగ్ నుంచి ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. పైగా వయసు కూడా మీద పడటంతో దర్శకనిర్మాతలు ఈమెకు పక్కన పెట్టేశారు. దీంతో శ్రియకు సినిమా ఆఫర్లు అమాంతంగా తగ్గిపోయాయి.
అప్పుడప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలలో నటించినప్పటికీ.. ఎవ్వరూ ఈమెను అంతగా పట్టించుకోలేదు. చివరికి ఈ అమ్మడు చేసేదేమీ లేక ‘‘పవిత్ర’’ సినిమాలో వేశ్య పాత్రలో నటించడానికి ఒప్పేసుకుంది. దాంతోనైనా తనకు ఆఫర్లు వస్తాయని భావించిన ఈ అమ్మడికి.. ఆ తరువాత అడ్రస్ లేకుండా పోయింది. ఎలాగైనా సినిమాలలో తిరిగి రావాలనే ఆశతో కొన్నాళ్లవరకు అన్ని సినీ రంగాల్లో వీలు దొరికినప్పుడల్లా చక్కర్లు కొట్టింది. హాట్ హాట్ ఫోటోషూట్ లు ఇస్తూ తన అందాలను ఆరబోసేసింది. యూత్ ని రక్తికట్టించేలా బికినీలో దర్శనమిచ్చింది. బహుశా వీటి ద్వారానే ఈ భామకు ఒక్కొక్కటిగా ఆఫర్లు వస్తున్నట్టు కనిపిస్తున్నాయి.
చాలారోజుల తరువాత టాలీవుడ్ లో పద్ధతిగల ఒక పల్లెటూరి అమ్మాయిగా అక్కినేని త్రయం కలిసి నటించిన ‘‘మనం’’ సినిమాలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ ‘‘గోపాల గోపాల’’ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అలాగే బాలీవుడ్ లో కూడా ఇంకొక మూవీ చేస్తోంది. ఇంతకుమించి ఈ అమ్మడి చేతిలో మరే సినిమా ఆఫర్లు లేవు. కానీ ఈమె మాత్రం తన పాత ఇమేజ్ నే తిరిగి రప్పించుకోవాలని భావిస్తున్నట్టు వుంది. ఈ సందర్భంగానే తాజాగా మరో హాట్ ఫోటోషూట్ ఇచ్చేసింది.
ఈసారి మరింత హాట్ గా కనిపిస్తూ అందరి దృష్టిని తనవైపుకు ఆకర్షించుకుంది. ఈ ఫోటోషూట్ ను చూసిన ప్రేక్షకజనాలు శ్రియ ఎందుకు ఇటువంటి పోజులిస్తోందని అనుకుంటున్నారు. దీనిని వీక్షించిన కొంతమంది నెటిజన్లు, సినీ విశ్లేషకులు అయితే.. సినిమా ఆఫర్లు కోసమే శ్రియ ఈ విధంగా హాట్ గా ఫోటోషూట్ లు ఇస్తోందని అనుకుంటున్నారు. మరి ఇప్పుడైన శ్రియకు అదృష్టం కలిసొస్తుందో, లేదో..? వేచి చూడాల్సిందే! ఆల్ ది బెస్ట్ హాట్ లేడీ..!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more