Krishnam raju remake alluri seetarama raju with prabhas

Krishnam Raju Prabhas, Krishnam Raju Prabhas Movie, Krishanam Raju Prabhas Upcoming Movie, Tollywood Movie News, Latest Telugu Gossips, Latest Telugu Movie Gossips

Krishnam Raju remake Alluri Setha Rama Raju with Prabhas, But Prabhas busy with his movie Bhahubali. Fans are waiting for Krishanam Raju and Prabhas combination. For Latest Telugu Movie News and Gossips click on www.teluguwishesh.com

ప్రభాస్ పెద్దనాన్న కోరికను నెరవేర్చేనా ?

Posted: 07/05/2014 03:39 PM IST
Krishnam raju remake alluri seetarama raju with prabhas

గత కొంత కాలంగా టాలీవుడ్ రెబల్ స్టార్, రాజకీయ నాయకుడు అయిన కృష్ణం రాజు తన వారసుడు అయిన ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నారు. ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల అది ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ‘బాహుబలి ’ షూటింగ్ బిజీలో ఉన్న ప్రభాస్ తో కాల్షీట్లు లేని టైంలో ‘ఒక్క అడుగు ’ సినిమా చేయబోతున్నాడని ఆ మధ్య  వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు ఆ సినిమాను ప్రక్కన పెట్టి, ఆయన నట జీవితంలో డ్రీమ్ రోల్ అయిన ‘అల్లూరి సీతారామాజు ’ పాత్రను చేయాలని అప్పట్లో చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అదే పాత్రను సూపర్ స్టార్ కృష్ణ పోషించి మెప్పించడంతో ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు అదే పాత్రను ప్రభాస్ తో చేయించాలని చూస్తున్నాడట. ప్రస్తుతం ‘బాహుబలి ’ సెట్లో ప్రభాస్ గెటప్ ను చూసి పాత్రకు సరిగ్గా సరిపోతాడని ఫిక్సయి ప్రభాస్ తో సీతారామరాజు నిర్మించాలని ఆలోచిస్తున్నట్టు టాలీవుడ్ లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం చేస్తున్న చిత్రానికే దాదాపు ఇంకో ఏడాది సమయం పడుతుంది. ఇఫ్పటికే జానపద చిత్రంలో నటిస్తూ లవ్ అండ్ యాక్షన్ సినిమాలకు దూరం అవుతున్న ప్రభాస్ బాహుబలి తరువాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలలో ఉన్నాడు. మరి కృష్ణం రాజు ఆశ పడుతున్నట్లు ప్రభాస్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నా అది కార్యరూపం దాల్చడానికి మాత్రం ఇంకా చాలా సమయమే పడుతుందని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles