Samantha item song in geethanjali movie

samantha item song in geethanjali movie, kona venkat geethanjali moive, samantha doing item song , samantha turns item song,

samantha item song in geethanjali movie

ఆయన కోసం ఐటెం వేశాలు వేస్తుంది ???

Posted: 07/02/2014 03:55 PM IST
Samantha item song in geethanjali movie

సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలిలో టాప్ రేసులో హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంతా తనకు వచ్చిన అవకాశాల్ని ఏ మాత్రం వదిలిపెట్టుకోవడం లేదు. సింగల్ స్టారర్ సినిమాలైనా, మల్టీస్టారర్ సినిమాలైనా వచ్చిన అవకాశాన్ని ఏ రూపాయి అటో ఇటో మాట్లాడేసుకొని డేట్స్ ఇచ్చేస్తుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్న సమంతా ఇప్పటి వరకు హాట్ హాట్ ఎక్స్ పోజింగులకు మాత్రమే సై అన్న ఈమె ఇప్పుడు ఐటెంగాళ్ అవతారం కూడా ఎత్తడానికి సిద్దపడింది.

ప్రముఖ రచయిత అయిన కోన వెంకట్ దర్శకత్వం వహిస్తున్న ‘గీతాంజలి ’ సినిమాలో ఈ అమ్మడు ఐటెంసాంగ్ చేయడానికి సిద్దపడినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం అయ్యి, తరువాతి కాలంలో రచయితగా, ఇప్పుడు దర్శకుడిగా మారిన కోన వెంకట్ అంజలిని ప్రధాన పాత్రలో పెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మరిత స్టఫ్ ఉండాలని భావించిన కోన తనకు స‌న్నిహితురాలైన స‌మంత‌తో ఓ ఐటం సాంగ్‌కి ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్.అదీ కాకుండా కోన వెంక‌ట్ సోద‌రి, నీర‌జా కోన‌ స‌మంత‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తోంది. 

నీర‌జ అంటే స‌మంత‌కు ప్రత్యేక‌మైన అభిమానం. ఆ ఇష్టంతోనే ఈ పాట‌లో నటించ‌డానికి ముందుకొచ్చి , త‌నకున్న డేట్స్ కమిట్‌మెంట్ బ‌ట్టి ఈ పాట‌లో న‌ర్తిస్తాన‌ని మాటిచ్చింద‌ట‌. సో త్వరలో సమంతాను ఐటెంగాళ్ గా చూబడోతున్నామన్న మాట. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు అవకాశాలు దండిగా ఉన్నప్పుడు ఐటెం పాటకు ససేమిరా అనేవారు. కానీ వీరు బాలీవుడ్ భామల నుండి వీరు స్ఫూర్తి పొందారో ఏమో గానీ శ్రుతి హాసన్, తమన్నా, సమంతాలు కూడా ఐటెం గాళ్స్ అవతారం ఎత్తారు. ముందు ముందు మరింత మంది భామలు కూడా ఈ రూట్లోకి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles