Filmfare awards 2013 telugu films nominations list

south filmfare awards 2013, samantha, filmfare awards, 61st Idea South Film fare Awards 2013, South Indian film industry

south filmfare awards 2013

ఫిలిం ఫేర్ అవార్డులకు అగ్ర హీరోల పోటా పోటీ

Posted: 07/02/2014 05:40 PM IST
Filmfare awards 2013 telugu films nominations list

సినిమా రంగంలో వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ఇచ్చే ముఖ్యమైన  అవార్డుల్లో ఫిలింఫేర్ అవార్డులు కూడా ఎంతో ముఖ్యమైనవి. వివిధ భాషల నుండి ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రధానం చేస్తారు. మన దక్షిణాది నుండి తెలుగు లో గత సంవత్సరం ఘన విజయం చిత్రాల్లో కొన్నింటిని  ఈ అవార్డులకు నామినేట్ చేశారు. వాటి వివరాలను నేడు ప్రకటించారు ఆ అవార్డుల నిర్వాహకులు. తెలుగులో టాప్ హీరోలు అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ ల సినిమాలు గట్టి పోటీ పడ్డాయి.

టాలీవుడ్ లో ఘన విజయం సాధించిందిన అత్తారింటికి దారేది, ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మిర్చి, కామెడీ అండ్ లవ్ స్టోరీ గుండెజారి గల్లంతయ్యిందే  సినిమాలు పలు విభాగాల అవార్డు నామినేషన్లలో కూడా తమ హవాను కొనసాగించాయి. మేజర్ కేటగిరిలైన ఉత్తమ హీరో, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ హీరోయిన్ విభాగాలలో అన్ని నామినేషన్లను ఈ సినిమాలు కైవసం చేసుకున్నాయి. ఉత్తమ హీరో విభాగంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, నితిన్, రామ్ చరణ్ లు పోటి పడుతున్నారు.

ఉత్తమ సంగీత దర్శకుడిగా అత్తారింటికి దారేది, మిర్చి సినిమాలకు గాను దేవి రెండు సార్లు నామినేట్ అయ్యారు. ఉత్తమ దర్శకుల జాబితాలో కొరటాల శివ ‘మిర్చి ’, శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో, త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్తారింటికి దారేది, విజయ్ కుమార్ కొండా ‘గుండె జారి ’, విరించి వర్మ ‘ఉయ్యాల జంపాల ’ పోటీలో ఉన్నారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాదించిన ‘ఉయ్యాలా జంపాలా ’కు కూడా ఫిలిం ఫేర్ అవార్డులలో సముచిత ప్రాధాన్యం లభించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలలో తమ నటనతో మెప్పించిన అంజలి, నదియా, ప్రణితలు ఉత్తమ సహాయ నటి విభాగంలో పోటి పడుతున్నారు. ఉత్తమ సహాయ నటులుగా బ్రహ్మాజీ , ప్రకాష్ రాజ్ , సందీప్ కిషన్, సునీల్, వెంకీలు పోటీ పడుతున్నారు. ఉత్తమ గాయని నామినేషన్లలో గీతా మాధురికి కూడా చోటు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles