Shruthi haasan mahesh special song

shruthi haasan-mahesh special song from tomorrow, shruti hassan,mahesh babu,aagadu,shruti haasan in aagadu,shruti haasan in aagadu movie,shruti haasan item song confirmed in aagadu,

Shruthi Haasan-Mahesh special song from tomorrow

తొలి ఛాన్స్ హీరోయిన్ గా కాదు... ఐటెంగాళ్ గా

Posted: 07/02/2014 03:00 PM IST
Shruthi haasan mahesh special song

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో జత కట్టింది కానీ సూపర్ స్టార్ మహేష్ తో నటించే ఛాన్స్ దక్కించుకోలేక పోయింది అందాల సుందరి శృతి హాసన్. ఈయన ప్రక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఈ అమ్మడుకు హీరోయిన్ గా కాదు గానీ ఐటెం గాళ్ గా నటించే ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా లాంటి వారి లాగా ఐటం సాంగులు చేయడానికి ఏ మాత్రం వెనకాడని శృతి ‘ఆగడు’లో స్పెషల్‌ సాంగ్ చేయాలని ఆమెని శ్రీను వైట్ల రిక్వెస్ట్‌ చేయడంతో మారు మాట్లాడకుండా వెంటనే ఓకే చేసేసిందని సమాచారం.

మొదట ఈ అమ్మడు మణిరత్నం మల్టీస్టారర్‌లో మహేష్‌బాబు సరసన శృతిహాసన్ కనిపించబోతోందంటూ ఆ మధ్య వార్తలొచ్చినప్పుడు శృతి పంటపండినట్లేనని, టాలీవుడ్ లో ఈమె స్థానం మరింత పైకెళ్ళడం ఖాయం అని అనుకున్నారు. ఆ ప్రాజెక్టు అటెకెక్కి మహేష్ సరసన ఛాన్స్ మిస్సయిందనుకొకుంటున్న తరుణంలో ఇలా మహేష్ సరసన ఐటెం గాళ్ గా వచ్చిన ఛాన్స్ ని మిస్ చేసుకోవడానికి ఇష్టపడక కమీట్ అయిందని అంటున్నారు. ఏమైతేనే మహేష్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఎప్పుడొస్తుందో గానీ, ఇప్పుడైతే ఐటెంగాళ్ గా సరిపెట్టుకోబోతుంది. ఈ పాట కోసం శృతి బాగానే వసూలు చేస్తుందట. ఇటు డబ్బులు, అటు ప్రిన్స్ తో ప్రక్కన ఛాన్స్. లక్కంటే శృతిదే అంటున్నారు సినీ జనాలు. వీళ్లిద్దరి మధ్య స్పెషల్ సాంగ్‌ని రేపటి నుండి (గురువారం ) షూట్ చేయబోతున్నారట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles