Prabhas bahubali movie budget 170 cores

prabhas bahubali movie budget 170 cores, rajamouli new project bahubali, babubali high budget movie, prabhas, rana, anushka, tamanna, mm keravani,

prabhas bahubali movie budget 170 cores

నిర్మాతలను భయపెడుతున్న జక్కన్న

Posted: 07/02/2014 12:39 PM IST
Prabhas bahubali movie budget 170 cores

టాలీవుడ్ లో ఓటమంటూ ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి సినిమాల బడ్జెట్ సినిమా సినిమాకు పెరిగిపోతుంది. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే దర్శకుడిగా పేరున్న ఈయన సినిమా మొదలు పెట్టేటప్పుడు చెప్పే బడ్జెట్ కన్నా దాదాపు రెట్టింపు అవుతుంది. కారణం ఆయన మెల్లిగా, తాను అనుకున్న విధంగా సీన్ వచ్చే వరకు చేయడమే. దీంతో రోజు రోజుకు నిర్మాతకు భారం పెరుగిపోతుంది. ఈగ సినిమా విషయంలో కూడా సాయి కొర్రపాటికి అదే జరిగింది. తొలుత 10 కోట్లతో సినిమా తీద్దామని చెప్పి మొదలు పెట్టించి, దానిని 30 కోట్లతో ముగించాడు.

ఆ సినిమా ఘన విజయం సాధించడంతో నిర్మాతకు లాభాల పంట పండింది. ప్రస్తుతం జక్కన్న టాలీవుడ్ లో అంత్యంత భారీ బడ్జెట్ తో ‘బాహుబలి ’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మొదట్లో ఈ చిత్రానికి 100 కోట్ల వ్యయం అవుతుందన్నారు. ఇప్పుడిది 175 కోట్లకు చేరుతున్నట్టు చెబుతున్నారు. ఆర్టిస్టుల, సాంకేతిక నిపుణుల పారితోషికం, సెట్స్, లొకేషన్స్, నెంబరాఫ్ వర్కింగ్ డేస్, షెడ్యూల్ ప్రకారం షూటింగు జరగక పోవడంతో బడ్జెట్టు బాగా పెరిగిపోయినట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

అయితే, ఇంత బడ్జెట్టుతో నిర్మిస్తే ఇది నిర్మాతకు వర్కౌట్ అవుతుందా ? కేవలం రాజమౌళిని, స్టార్ నటీనటులను నమ్మి కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలతకు ఈ సినిమా లాభాలు తెప్పిస్తుందా ? అంటే కేవలం తెలుగే కాకుండా తమిళ, హిందీ భాషలతో బాటు విదేశీ భాషలలోకి కూడా దీనిని డబ్ చేస్తుండడం వల్ల అన్ని మార్గాల నుంచీ వచ్చే ఆదాయంతో తప్పకుండా లాభాల పంట పండిస్తుందని ఇండస్ట్రీ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఎంత భార్జీ బడ్జెట్ సినిమా అయినా కాస్తంత చూసి ఖర్చు పెట్టి, సాధ్యమైనంత తొందరగా ముగిస్తే బాగుంటుందేమో ? అంచనాలు తలకిందులు అయితే పరిస్థితి ఏంటి ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles