Amitabh bachchan in manam hindi remake

Manam Hindi Remake, h Amitabh Bachchan, Aamir Khan, Ranbir Kapoor, Manam Bollywood Remake, Bollywood remake, MANAM hindi remake

ANR starring film is all set to be remade in Hindi. As per reports, Amitabh Bachchan, Aamir Khan and Ranbir Kapoor playing main rolles.

హిందీ ‘మనం ’ రీమేక్ లో బిగ్ బి..?

Posted: 05/29/2014 10:58 AM IST
Amitabh bachchan in manam hindi remake

డా.అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రల్లో శ్రీమతి అన్నపూర్ణ ఆశీస్సులతో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని కుటుంబం నిర్మించిన ‘మనం’ మే 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్స్‌తో సూపర్‌హిట్‌ చిత్రంగా నిలవడమే కావడమే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవలి కాలంలో వచ్చిన ఆణిముత్యంగా చెప్పబడుతుంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్ పోషించాడు. తెలుగులో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన రీమేక్ రైట్స్ ని బిగ్ బి నాగ్ నుండి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు తెలుగులో కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించిన రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ హిందీలో నిర్మించబోతుందట.

తెలుగులో దీనికి దర్శకత్వం వహించిన విక్రంకుమార్ హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించనున్నాడట. ఇందులో తారాగణంగా నాగ్ పోషించిన పాత్ర కోసం అమీర్ ఖాన్ ని సంప్రదించారు. ఇక నాగచైతన్య రోల్ కోసం రణబీర్ కపూర్ ని సెలక్ట్ చేసి వారితో సంప్రదింపులు జరుపుతున్నారట.  కథానాయికలుగా ప్రీతిజింటా, కత్రినాకైఫ్ లను అనుకుంటున్నారు.

దీనికి సంబధించిన చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తరువాత అఫీషియల్ ప్రకటన చేస్తారని అంటున్నారు. తెలుగులో అమితాబ్ గెస్ట్ రోల్ పోషిస్తే, ఆ పాత్రను హిందీలో నాగ్ పోషిస్తాడేమో చూడాలి. ఇంత వరకు బాగానే ఉన్నా టాలీవుడ్ లో నట సామ్రాట్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో బిగ్ బి నటించడానికి ఒప్పుకున్నాడంటే ఆయనలా నటించగలుగుతాడా ? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్న టాలీవుడ్ సినీ జనాలు.]

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles