Ram charan sreenu vaitla film sets from september

Ram Charan Sreenu Vaitla film, Ram charan under Sreenu Vaitla direction , Boyapati Sreenu, Govindudu Andarivadele, Aagadu movie,

Ram Charan will be acting under Sreenu Vaitla direction on september.

ఒక శీనుకు డేట్స్ ఇచ్చాడు.. మరో శీనుకి హ్యాండ్ ఇచ్చాడు

Posted: 05/29/2014 12:20 PM IST
Ram charan sreenu vaitla film sets from september

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రముఖ దర్శకులకు హ్యాండ్ ఇచ్చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇటీవలే ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ సినిమా కథ చెబితే డేట్స్ ఖాళీ లేవని దాట వేసిన ఆయన, ఇప్పడు బోయపాటి శీనుకు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.  చాలా రోజుల నుండి ఈ మాస్ దర్శకుడు రామ్ చరణ్ తో రూలర్ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి.

అంతలో ఎన్టీఆర్ తో చేసిన ‘దమ్ము ’ సినిమా ప్లాప్ కావడంతో ఆ సినిమాను ప్రక్కన పెట్టేశాడు. ఆ తరువాత ఎలాగొలాగో కష్టపడి బాలయ్యను ఒప్పించి ‘లెజెండ్ ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా తరువాతనైనా రామ్ చరణ్ డేట్స్ ఇచ్చేశాడని, బోయపాటి తరువాతి సినిమా చరణ్ తోనే అనే ప్రచారం కూడా సాగింది. కానీ ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇచ్చి శీను వైట్ల సినిమాను ఫైనల్ చేశాడు.

ప్రస్తుతం క్రిష్ణ వంశీ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరి వాడేలే ’ సినిమా చేస్తున్న చెర్రీ ఈ సినిమా తరువాత శీనువైట్లతో కామెడీ, యాక్షన్ తో తెరకెక్కే సినిమాలో చేయనున్నాడు. ఈ సినిమా షూటింగు శీనువైట్ల ఆగుడు తరువాత అంటే సెప్టెంబర్ నుండి మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించబోతున్నాడు.

ఈ సినిమాలో మహేష్ 1 బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది .రామ్ చరణ్ తో శీను వైట్ల చేయబోయే ఈ చిత్రంతో చాలా రోజుల తరువాత మెగా కంపౌండ్ లోకి మళ్ళీ అడుగుపెట్టబోతున్నాడట మాట. ఇప్పటి వరకు చరణ్ దాదాపు అన్ని మాస్  సినిమాలే చేశాడు. ఇలా రోటీన్ సినిమాల్ని ప్రక్కన పెట్టి ఇలాంటి కథలతో ట్రై చేద్దామనే వైట్లతో కమీట్ అయ్యి, బోయపాటిని ప్రక్కన పెట్టాడని అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles