Nikhil karthikeya movie trailer talk super

Nikhil Karthikeya Movie Trailer Talk Super, Nikhil Karthikeya Movie, Karthikeya Movie Trailer release, Nikhil Karthikeya Movie, Hero nikhil, colors swathi

Nikhil Karthikeya Movie Trailer Talk Super, Nikhil Karthikeya Movie, Karthikeya Movie Trailer release, Nikhil Karthikeya Movie, Hero nikhil, colors swathi

కార్తీకేయ ట్రైలర్ టాక్ సూపర్

Posted: 05/28/2014 07:22 PM IST
Nikhil karthikeya movie trailer talk super

యంగ్ హీరో నిఖిల్ ‘స్వామిరారా ’ సినిమా విజయంతో ఫాంలోకి వచ్చిన ఆయన ఇప్పుడు ‘కార్తికేయ ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన దర్శకుడు చందు ముండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ నేడు విడుదల అయ్యింది. నేడు విడుదల అయిన ఈ ట్రైలర్ కి మంచి టాక్ వినిపిస్తుంది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ని చూస్తుంటే చాలా కాలం తరువాత తెలుగు తెర పై మరో మంచి థ్రిల్లర్ సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ కలుగుతుంది.

ట్రైలర్ లో నిఖిల్ చెప్పిన మూడు డైలాలుగులు ఆకట్టుకునే విధంగా, ఆలోచించే విధంగా ఉన్నాయి. ‘గుండ్రంగా తిరిగే భూమికి వాస్తులేమిటి సార్? ప్రశ్నని ప్రశ్నలా వ‌దిలేయ‌డం కంటే ప్రాణాలు వ‌దిలేయ‌డం బెట‌ర్‌ .. కొన్ని అబ‌ద్దాలు ఆలోచించ‌కుండా న‌మ్మేస్తాం. కొన్ని నిజాల్ని న‌మ్మడానికి ఆలోచిస్తాం.. వంటి డైలాగులతో ఆకట్టుకున్నాడు.

థ్రిల్లర్స్ సినిమాలను ఇష్టపడే వారికి ట్రైలర్లో మాదిరి సినిమాలో కూడా సస్పెన్సులు ఉంటే నిఖిల్ మరో విజయం అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చూద్దాం ఈ సైన్స్ థ్రిల్లర్ మూవీ ఏ మాత్రం ఆకట్టుకుంటుందో ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles