Puri jagannath ntr movie pokiri 2

Puri Jagannath-NTR Movie Pokiri-2, Puri Jagannath-NTR Movie Pokiri Sequel, Director Puri Jagannath, young tiger Jr.NTR, uri Jagannath Pokiri Sequel With NTR

Puri Jagannath-NTR Movie Pokiri-2, Puri Jagannath-NTR Movie Pokiri Sequel, Director Puri Jagannath, young tiger Jr.NTR, uri Jagannath Pokiri Sequel With NTR

ఎన్టీఆర్ తో పూరీ పోకిరి సీక్వెల్

Posted: 05/28/2014 10:29 AM IST
Puri jagannath ntr movie pokiri 2

పూరీ జగన్నాథ్ - మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి ’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా పూరీకే కాకుండా, మహేష్ బాబుకు ఎంతో పేరు తెచ్చింది కూడా. అలాంటి ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానని గతంలో ఎప్పుడో ప్రకటించాడు పూరి. దానికి మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల వీరిద్దరి కాంబినేషన్ కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మహేష్ ని వదిలి ఎన్టీఆర్ ని పట్టుకున్నాడు.

ఈయనతో దాదాపు పది సంవత్సరాల తరువాత సినిమా చేస్తున్న పూరీ పోకిరి -2 చేయబోతున్నాడా ? అంటే అవుననే తెలుస్తుంది. ఈ సినిమాకు రచయిత అయిన వక్కంతం వంశీ పూరీ జగన్నాథ్ సూచనల మేరకు కథను దానికి సీక్వెల్ ఉండేలా చూస్తూ, మథ్యలో తనదైన మార్క్ సీన్లు యాడ్ చేశాడట. పోకిరిలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాడు. ఇందులో కూడా ఎన్టీఆర్ ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించడానికి ప్లాన్ చేశాడట.

ఇందంతా చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ తో చేసేది ‘పోకిరి `ః-2 ’ అని గట్టిగా నమ్మాల్సి వస్తుంది. ఎన్టీఆర్ ‘బాద్ షా ’ సినిమాను నిర్మించిన బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles